walking fish: నడిచే చేపల గురించి విన్నారా?.. ఇవి ఎక్కడ జీవిస్తున్నాయంటే..

Update: 2024-08-16 13:36 GMT

దిశ, ఫీచర్స్ : చేపల గురించి అందరికీ తెలిసిందే. వాటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే అవి నీటిలో మాత్రమే నివసిస్తాయని, బయటి పరిస్థితుల్లో బతకలేవని మనకు తెలిసిన విషయమే. కానీ కొన్ని ప్రాంతాల్లోని చేపలు మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు జంతు శాస్త్రవేత్తలు. ఎందుకంటే అక్కడ చేపలు నీటిలోనే కాకుండా బయటి పరిస్థితుల్లోనూ మనగలుగుతాయని, పైగా కప్పల్లాగా గెంతుకుంటూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తాయని చెప్తున్నారు. ఈ అరుదైన మడ్ స్కిప్పర్ చేపలు ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని సముద్రాల్లో, అలాగే తీరం వెంబడి కూడా నివసిస్తుంటాయి. గోబియిడే కుటుంబానికి చెందిన ఈ చేపలు ఉభయ చరాలుగా జీవిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో..

నిజానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్రపు నీరు ఎల్లప్పుడూ ఒకే లెవల్‌లో ఉండదు. కొన్నిసార్లు చాలా తక్కువగా ఉంటుంది. మరికొన్నిసార్లు అత్యధికంగా ఉంటుంది. ఈ పరిస్థితిని ఇంటర్ టైడల్ అంటారు. ఈ రకమైన ప్రదేశాల్లో సముద్రపు జీవులు బయటి వాతావరణంలో జీవించడం చాలా కష్టం. కానీ మడ్ స్కిప్పర్ అనే గోబియిడే జాతికి చెందిన చేపలు మాత్రం.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో బతికేందుకు అవసరమైన శరీర నిర్మాణం డెవలప్ అయిందని, అది నీటిలో ఉండటమే కాకుండా, నీరు లేనప్పుడు భూమి మీద కూడా నడవగలుగుతుందని శాస్త్రవేత్తులు చెప్తున్నారు. అందుకే వీటిని ఉభయ చరాలు అంటారు. కొందరు ముద్దుగా ‘మోప్పడాయ చేపలు’ అని కూడా పిలుస్తుంటారు. ఇవి చర్మం, మౌత్ లోపలి భాగం ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ ప్రాసెస్‌ను ‘కటేనియస్ రెస్పిరేషన్’ అంటారు.

మడ్ స్కిప్పర్స్ ఏం తింటాయి?

ఇండో- పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఉండే మడ్ స్కిప్పర్లు ఉభయ చరాలు. కాబట్టి అవి నీటిలో, బయట బురదలో లభించే ఆహారాలను తీసుకుంటాయి. ముఖ్యంగా చిన్న చేపలు, రొయ్యలు, కీటకాలు వంటివి తింటుంటాయి. ఇక వీటిలో మగ చేపలు ఆడ మడ్ స్కిప్పర్లను అట్రాక్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. వెన్ను రెక్కలను విప్పడం, ఉత్సాహంగా నీటిలో దూకడం వంటి హావ భావాలను ప్రదర్శిస్తాయి. 

Tags:    

Similar News