Walking benefits: రోజుకు 11 నిమిషాల నడక.. ఆయుష్షును పెంచుతుందంటున్న నిపుణులు

మీరు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా?.. అయితే రోజుకు కనీసం 11 నిమిషాలైనా వేగంగా వాకింగ్ చేయండి. దీనివల్ల మీ ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు చెప్తు్న్నారు.

Update: 2024-08-22 13:09 GMT

దిశ, ఫీచర్స్ : మీరు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా?.. అయితే రోజుకు కనీసం 11 నిమిషాలైనా వేగంగా వాకింగ్ చేయండి. దీనివల్ల మీ ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిషైన అధ్యయనం కూడా అదే వెల్లడించింది.

వాస్తవానికి నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటి కారణాలతో డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటి కారణంగా అకాల మరణాలు సంభవిస్తుంటాయి. అదే ఫిజికల్ యాక్టివిటీస్ లేదా రోజూ 11 నిమిషాల వేగవంతమైన నడక అలవాటు కలిగి ఉంటే అలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా అప్పటికే అధిక బరువు ఉన్నవారు వెయిట్ తగ్గడంలో తగ్గడంలో పదకొండు నిమిషాల నడక సహాయపడకపోవచ్చు కానీ.. కేలరీలు బర్న్ చేయగలదని, అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News