విటమిన్-డి లోపిస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలి?

ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో విటమిన్ లోపం ఏర్పడుతుంది.

Update: 2024-03-27 10:34 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో విటమిన్ లోపం ఏర్పడుతుంది. కాగా మనిషి హెల్తీగా ఉండాలంటే విటమిన్ - డి చాలా అవసరం. విటమిన్ డి లేకపోతే శరీరంలో ఎన్నో రకాల రోగాలు తలెత్తుతాయి. ఆహారంపై శ్రద్ధ చూపకపోవడం, శరీరానికి సూర్యరశ్మి అందకపోవడం వల్ల విటమిన్ డి లోపిస్తుంది. దీంతో అలసట, మజిల్ పెయిన్, బోన్ పెయిన్, మెట్లు ఎక్కలేకపోవడం, కాళ్లు, పెల్విస్, నొప్పులు, కింద కూర్చుని లేచినప్పుడు ఇబ్బందిగా అనిపించడం, హిప్స్ ప్రాంతం లో స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వంటి లక్షణాలు విటమిన్ డి లోపిస్తే కనిపిస్తాయి.

అయితే తాజాగా ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో కండరాలు, ఎముకల బలహీనతకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని, దీని లోపం వల్ల జుట్టు రాలడం తో పాటు కొన్ని సందర్భాల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కాగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రకరకాల విటమిన్లు అవసరమని సూచిస్తున్నారు. కాగా నిపుణులు.. విటమిన్ డి లోపాన్ని అధిగమించే ఈ ఫుడ్స్ తీసుకుంటే మేలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రాగి, బార్లీ, గోధుమలు, వోట్స్ వంటి తృణధాన్యాల్లో విటమిన్ డి ఫుష్కలంగా లభిస్తుంది. జున్ను, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు ఆరెంజ్ జ్యూస్, ట్యూనా, సాల్మన్, గుడ్ల సొనలు మీ డైట్‌లో చేర్చుకుంటే మీ శరీరానికి కావలిసిన విటమిన్ డి లభిస్తుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.


Similar News