చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్ సి.. వీటిని తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తారట

ఏజ్ ఎంతున్నా చూడ్డానికి యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడతుంటారు. అందుకోసం కొందరు రకరకాల మాయిశ్చరైజర్స్, స్కిన్ అండ్ ఫేషియల్ క్రీములు వాడుతుంటారు.

Update: 2024-06-04 12:29 GMT

దిశ, ఫీచర్స్ : ఏజ్ ఎంతున్నా చూడ్డానికి యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడతుంటారు. అందుకోసం కొందరు రకరకాల మాయిశ్చరైజర్స్, స్కిన్ అండ్ ఫేషియల్ క్రీములు వాడుతుంటారు. కానీ ఇవి మాత్రమే చర్మ సౌందర్యాన్ని పెంచవని నిపుణులు చెప్తున్నారు. మనం తినే ఆహారాలు, వాటిలో లభించే పోషకాలు, విటమిన్లు స్కిన్ హెల్త్‌కు మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉండే పండ్లు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని తినడంవల్ల చర్మంలో ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయి. యవ్వనంగా కనిపించడానికి దోహదం చేసే ఫ్రూట్స్ ఏమిటో చూద్దాం.

* స్ట్రా బెర్రీలు : వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా గుండె, మెదడు ఆరోగ్యానికి కూడా స్ట్రా బెర్రీలు మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. విటమిన్ సి వాపును తగ్గించడంలో, అలాగే బయట తిరిగేటప్పుడు యూవీ కిరణాల ప్రభావం పడి చర్మానికి నష్టం జరగకుండా కాపాడటంలో కీ రోల్ పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది.

* పైనాపిల్ : పైనాపిల్‌ల్లో హై వాటర్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ సి కలిగి ఉండటంవల్ల రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కొల్లాజెన్ హార్మోన్ రిలీజ్‌లో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. సంక్రమణ వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తుంది. ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.

*కివి, పుచ్చకాయ : కేలరీలు తక్కువగా ఉండే కివిలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో కూడా విటమిన్ సి ఉండి, రోగ నిరోధక శక్తికి మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి, సౌందర్యానికి హెల్ప్ అవుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

* నారింజ : ఇందులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. జీవక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, అలసటను దూరం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి చర్మ రోగాలు రాకుండా ఉంటాయి. స్కిన్ అలెర్జీలను, ఏజింగ్ లక్షణాలను నివారించి యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది.


Similar News