Viral video: యువతి బంపరాఫర్.. తట్టుకోలేక ఆగమైతున్న కుర్రాళ్లు !
కొన్ని సందర్భాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేసినట్లే, కొందరు వ్యక్తుల తీరు కూడా అప్పుడప్పుడూ విడ్డూరంగా అనిపిస్తుంది.
దిశ, ఫీచర్స్: కొన్ని సందర్భాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేసినట్లే, కొందరు వ్యక్తుల తీరు కూడా అప్పుడప్పుడూ విడ్డూరంగా అనిపిస్తుంది. అలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువతి ప్రకటించిన బంపర్ ఆఫర్‌ను చూసి యువకులు తెగ మురిసిపోతుండగా.. ఇలా చేస్తే యూత్ ఆగమైపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మెట్రో సిటీస్‌లో ఫుల్ డిమాండ్ కారణంగా అద్దె ఇండ్లు దొరకడం కష్టమైపోతోంది. అంత పెద్ద నగరంలో ఎక్కడని వెతికేదంటూ కొందరు బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు. పైగా వారు బ్రోకరేజ్ చార్జీలు వసూలు చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎంతో కొంత ముందుగానే జమచేయాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటికీ పరిష్కారంగా ఇప్పుడు పలు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికలు కూడా ఈ పనిని సులభతరం చేస్తున్నాయి. అద్దె ఇండ్ల కోసం, అలాగే రూమ్‌మేట్ల కోసం పలువురు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇచ్చిన బంపర్ ఆఫర్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. అదేంటో చూద్దాం.
వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. నికితా కేట్ అనే ఓ యువతి ముంబైలోని జుహూ ఏరియాలో నివసిస్తోంది. సొంతంగా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఏజెన్సీని నడుపుతోంది. కాగా ఆమె తాను నివసిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో తనతోపాటు 3 నుంచి 4 నెలలపాటు కలిసి ఉండేందుకు ఓ రూమ్‌మేట్ కావాలని, జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చునని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు తనకు నేరుగా మెసేజ్ చేయాలని, సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. కాగా యువతి అలాంటి అనౌన్స్‌మెంట్ చేయడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుండగా.. ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే కుర్రాళ్లు తట్టుకోలేక ఆగమై పోతారంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.
video credits to nikita.kat insta Id