Viral Video : వావ్.. ఈ కుక్కను చూశారా?.. ట్రాఫిక్ రూల్స్ ఎంత చక్కగా ఫాలో అవుతున్నదో!

కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మనుషులకంటే జంతువులు నయం! అనిపించే సందర్భాలు అరుదుగానైనా ఎదురవుతుంటాయి.

Update: 2024-06-07 09:07 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మనుషులకంటే జంతువులు నయం! అనిపించే సందర్భాలు అరుదుగానైనా ఎదురవుతుంటాయి. రీసెంట్‌గా అలాంటి సిచ్యువేషన్‌‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కాస్త ఫన్నీగా అనిపించినప్పటికీ, చక్కని మెసేజ్ కూడా ఉండటంతో అందరూ ఆశ్యర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఎం జరిగిందంటే.. అక్కడ రోడ్డుపై వాహనాలు వచ్చీ.. పోతూ ఉన్నాయి. జీబ్రా క్రాసింగ్ వద్ద ఒక కుక్క నిలబడి ఉంది. రెడ్‌ సిగ్నల్ పడినందుకు అది రోడ్డు దాటడం లేదు. కానీ కుక్క ముందు నిలబడిన ఓ మహిళ మాత్రం రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ క్రాసింగ్ వద్ద ప్రమాదకరంగా రోడ్డు దాటేసింది. కుక్క మాత్రం గ్రీన్ సిగ్నల్ పడే వరకూ వేచి చూసి, ఆ తర్వాతే రోడ్డు దాటింది. ఈ వీడియో ‘mallad-rag’ అనే ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. ప్రజెంట్  నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. చూసిన ప్రతి ఒక్కరూ ఆ కుక్క క్రమ శిక్షణకు ఫిదా అయిపోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో మూగ జీవాలకైనా తెలుస్తోంది కానీ.. కొందరు మనుషులకు మాత్రం ఎందుకు అర్థం కాడం లేదో’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

Full View


Similar News