ఏంది నాయనా అది.. ఫ్లైట్‌ను సొంత ఆటో అనుకున్నావా !!

ఎన్నడూ లేనిది ఫస్ట్ టైమ్ బస్సో, రైలో ఎక్కిన వ్యక్తి ప్రవర్తన మీరెప్పుడైనా గమనించారా? మిగతా ప్రయాణికులకు కాస్త భిన్నంగా ఉంటుంది.

Update: 2024-08-24 06:50 GMT

దిశ, ఫీచర్స్ : ఎన్నడూ లేనిది ఫస్ట్ టైమ్ బస్సో, రైలో ఎక్కిన వ్యక్తి ప్రవర్తన మీరెప్పుడైనా గమనించారా? మిగతా ప్రయాణికులకు కాస్త భిన్నంగా ఉంటుంది. సదరు వ్యక్తి ఆందోళనకో, ఆశ్చర్యానికో కూడా గురవుతుంటారు. కొందరికి పబ్లిక్ ప్లేస్‌లో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవచ్చు. మరికొన్నిసార్లు అనుకోకుండా ఇంట్లో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టే అక్కడ కూడా బిహేవ్ చేసి నవ్వులపాలవుతుంటారు లేదా విమర్శలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఎయిర్ పోర్ట్‌లో విమానం ఆగి ఉండగా ప్రయాణికులు అందులో ఎక్కుతున్నారు. కాగా ఓ ప్రయాణికుడు మాత్రం ఫ్లైట్ డోర్ దగ్గర నిలబడి, దర్జాగా జేబులోంచి గుట్కా తీసి, చేతితో నులిమి నోట్లో వేసుకున్నాడు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఓ విమానాన్ని ఆటోగా మార్చేవ్‌గా అంటూ కొందరు. అసలు గుట్కా ఏడ దొరికింది?, ఎలా అనుమతించారు? అని ఇంకొందరు. ఇది క్రమ శిక్షణా రాహిత్యమని మరికొందరు కామెంట్లు పెట్టారు. అది ప్రైవేట్ జెట్ కాబట్టి నడిచిందని కూడా పలువురు పేర్కొన్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Video : https://x.com/MehdiShadan/status/1826892671656312840

Tags:    

Similar News