viral video: కోతికి కోపం వచ్చింది.. యువతిని చూడగానే ఆగలేక ఏం చేసిందో చూడండి!

అసలే కోతి.. దానికి చిర్రెత్తుకొస్తే ఏం చేస్తుందో చూడకుండానే కచ్చితంగా చెప్పలేం కానీ.. ఏదో ఒక వెరైటీ పని చేస్తుందని మాత్రం ఊహించగలం.

Update: 2024-08-15 13:03 GMT

దిశ, ఫీచర్స్ : అసలే కోతి.. దానికి చిర్రెత్తుకొస్తే ఏం చేస్తుందో చూడకుండానే కచ్చితంగా చెప్పలేం కానీ.. ఏదో ఒక వెరైటీ పని చేస్తుందని మాత్రం ఊహించగలం. ప్రజెంట్ అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జూలో ఉన్న కోతిని చూసేందుకు వెళ్లిన యువతి దానిని ఫొటోలు తీస్తుండగా అనుకోని ఘటన జరిగింది. కోపంతో ఊగిపోయిన కోతి సదరు అమ్మాయి జుట్టు పట్టకొని చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఓ పెద్ద జాలి బోనులో ఉండే కోతులను చూసేందుకు అక్కడికి కొంతమంది వచ్చారు. అంతలో ఓ యువతి దగ్గరికి వెళ్లి కోతిని ఫొటోలు తీసింది. ఆ తర్వాత వీడియో తీసేందుకు ట్రై చేస్తూ.. చేయి ఊపుతూ దానిని వెనక్కి వెళ్లమన్నట్లు బిహేవ్ చేస్తుంది. ఎందుకో గానీ.. అప్పటి వరకు ఫొటోలు, వీడియో తీసినా సైలెంట్‌గానే ఉన్న కోతికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఇక ఆగలేక ఆవేశంగా ఆ యువతి జుట్టు పట్టుకొని లాగడం మొదలు పెట్టింది. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలడం లేదు. వెంటనే ఇది గమనించిన చుట్టు పక్కల జనం వచ్చి కోతిని బెదిరిస్తూ.. యుతిని కాపాడారు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. కోతికి కోపం వస్తే అలాగే ఉంటుందని కొందరు.. కోతి ముందు పిచ్చి వేషాలు అవసరమా అంటూ ఇంకొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

video Credits to najarsingh -1322 Insta id

Tags:    

Similar News