స్పీడ్‌బోట్ వెనక సర్ఫింగ్ చేసిన ఏడాది బాబు.. చూసినోళ్లు నోరెళ్లబెట్టారు! (వీడియో)
ముఖంలో చిరునవ్వవుతో ఎటూ కదలకకుండా తన రైడ్‌ని ఎంజాయ్ చేయడం చూడొచ్చు. A Little Boy Surfs Alone Behind Speedboat
దిశ, వెబ్‌డెస్క్ః ఏడాది వయసున్న పిల్లోడికి నడవడమే సరిగ్గా రాదు, అలాంటిది లోతైన నీళ్లల్లో సర్ఫింగ్ చేయడమంటే అది అసాధ్యం అనుకోకండి! తెలియని తనంలోనే కొన్ని నైపుణ్యాలు మనలో భాగమవుతాయి. ఇలాగే, ఒక బుడ్డ సర్ఫర్ ఎంతో ధైర్యంగా, క్యూట్‌గా ఇంటర్నెట్‌లో అందర్నీ ఆకర్షిస్తున్నాడు. చాలా మంది సాహస క్రీడలను చేయలేకపోయినా వాటిని ఇష్టపడతారు. అలాంటి వాటిలో సర్ఫింగ్‌ను చాలా మంది ఇష్టపడతారు. అయితే, ఈ బేబీ సర్ఫ్‌ర్‌ని చూసి, కాస్త భయపడినా, చూసిన తర్వాత చాలా క్యూట్‌గా చేశాడంటూ మురిసిపోతారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో 'TheFigen' అనే వినియోగదారు షేర్ చేశారు. ఇందులో ఒక చిన్న బాబు స్పీడ్‌బోట్ వెనుక సర్ఫింగ్ చేస్తూ, ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఉండటం చూడొచ్చు. అంతకుమించి, ఈ బుడ్డోడు పడిపోకుండా రోప్‌ను పట్టుకోవడం, అలాగే, వేగంగా వెళుతున్న క్రమంలో తన ముఖంపై వస్తున్న గాలి, సముద్రపు పొగమంచును ఆస్వాదిస్తూ, ముఖంలో చిరునవ్వవుతో ఎటూ కదలకకుండా తన రైడ్‌ని ఎంజాయ్ చేయడం చూడొచ్చు. ఇక, ఎలాగూ పిల్లాడు సురక్షితంగా ఉండటానికి సేఫ్టీ బెల్ట్ గట్రా ఉన్నాయి కనుక చిన్నారి రైడింగ్ హాయిగా సాగింది. ఈ వీడియోను చూసి ఇంటర్నెట్‌లో కొందరు 'ఆహా..!" అంటుంటే, ఇంకొందరు 'అయ్యో! ఏమైనా అయితే..' అంటూ కంగారుపడుతున్నారు. మీరూ చూడండి..
Aweeeeee little big surfer! ❤️😂😂pic.twitter.com/apWQhCLetx
— Figen (@TheFigen) May 25, 2022