కుక్క కంటే బెస్ట్ రూమ్మెట్ ఉండరంట.. ఎందుకో చూడండి! (వీడియో)
ఇలాంటి రూమ్మెట్ మాకూ కావలంటూ కామెంట్ బాక్స్ నింపుతున్నారు. Human thinks that their dog is the best roommate.
దిశ, వెబ్డెస్క్ః మానసంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడిన వేళ మనుషులకు జంతువుల కంటే మంచి మిత్రులు ఎవరుంటారు చెప్పండి! అందుకే, ఓ వ్యక్తి నా పెంపుడు కుక్క కంటే ఉత్తమ రూమ్మెట్ ఇంకెక్కడ దొరుకుతారు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నిజానికి, మనుషులకు, వాళ్ల పెంపుడు జంతువుల మధ్య ఎప్పుడూ ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. ఆ మనోహరమైన సంబంధాన్ని తెలిపే పెంపుడు పేరెంట్ ఇంటర్నెట్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను "మీకు ఏది ఎక్కువగా సహాయం చేస్తుంది?" అనే శీర్షికతో కుక్కకు అంకితం చేస్తూ, "నా కుక్క అత్యుత్తమ రూమ్మేట్ కావడానికి కారణాలు ఇవే" అని చెబుతాడు. అందులో, ఈ కుక్క బట్టలు లాండ్రీ చేయడం నుండి తదితర పనుల్ని నిర్వహించే విజువల్స్ చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజనులు ఇలాంటి రూమ్మెట్ మాకూ కావలంటూ కామెంట్ బాక్స్ నింపుతున్నారు.