ఏమీ ఆశించ‌నిదే ప్రేమ‌.. ఆ స్వ‌చ్ఛ‌త‌కు సాక్ష్యం ఈ దృశ్యం (వీడియో)

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు అచ్చ‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. Little girl feeding her father inside a local train.

Update: 2022-07-26 13:14 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః లోకంలో మ‌న నుండి ఏమీ ఆశించ‌ని వారు ఎవ‌రైనా ఉంటారంటే అది త‌ల్లిదండ్రులే అనేది స‌త్యం. ఇక‌, చాలా మంది తండ్రులతో కుమార్తెలే ఎక్కువ బంధాన్ని క‌లిగి ఉంటారు. ఎందుకంటే, క‌ని పెంచిన ప్రేమంటే ఆడ‌పిల్ల‌ల‌కే ఎక్కువ తెలుసు కాబ‌ట్టేమో!అయితే, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వీడియో మాత్రం స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు అచ్చ‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. ఈ ప్రేమ‌కు ఎవరూ సరిపోలరంటే అతిశ‌యోక్తి కాదు. ముంబైలోని లోకల్ ట్రైన్‌లో తండ్రీకూతుళ్లను చిత్రీకరించిన ఈ వీడియో హృద‌యాన్ని తాకుతుంది. కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాగే, మళ్లీ మళ్లీ చూడమని ప్రేరేపిస్తుంది. ఈ వీడియోను సాక్షి మెహ్రోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "ఇలాంటి క్షణాలు జీవించాలనుకుంటున్నారా!" అంటూ ఆమె ఈ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ఒక చిన్న అమ్మాయి తన తండ్రికి ముద్దుగా తినిపించడం, కూతురిపై అంతులేని ప్రేమ‌ను త‌ల నిమురుతూ చూపించిన‌ తండ్రిని ఈ వీడియోలో చూడొచ్చు..! 


Similar News