టాపింగ్లేని పిజ్జా ఆర్డర్.. నెట్టింట్లో నవ్వులే నవ్వులు! (వీడియో)
పిజ్జా అనగానే యమ్మీ రుచులు ఎన్నో గుర్తొస్తుంటాయి. Domino's worker received no-topping pizza order
దిశ, వెబ్‌డెస్క్ః పిజ్జా అనగానే రకరకాల వెజ్,నాన్‌వెజ్ ముక్కలు, కమ్మగా కాలిన రంగులు, నోరూరించే చీజ్ ఇలా యమ్మీ రుచులు ఎన్నో గుర్తొస్తుంటాయి. అందుకే, పిజ్జా టాపింగ్స్ చాలా శ్రద్ధగా ఎంపికచేసుకొని, ఆర్డర్ ఇస్తుంటారు. అందులోనూ డోమినో పిజ్జా ప్రకటనల్లోనే నోరూరించేటట్టు విభిన్న రకాల టాపింగ్లతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, ఓ వ్యక్తి దీనికి విరుద్ధంగా టాపింగ్ లేని పిజ్జా కావాలంటూ ఆర్డర్ ఇచ్చారు. బెత్ డట్టన్ అనే డొమినో వర్కర్ ఈ పిజ్జా ఆర్డర్‌ను అందుకున్నారు. కస్టమర్‌కు జీరో టాపింగ్స్ కావాలని చెప్పగానే ఆమె నవ్వుతూనే శ్రద్దగా దాన్ని తయారుచేసి ఇచ్చింది. కొన్నిసార్లు ఇలా వింత ఆర్డర్లను పొందాల్సి ఉంటుందంటూ ఆర్డర్‌ను అందిస్తుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వులతో స్పందించారు. ఒక్కోసారి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ కొందరు అన్నారు. ఇంకొందరు స్పందిస్తూ, అనారోగ్యంతో టాపింగ్ తినలేని వారు ఇలా టాపింగ్ లేని పిజ్జాను ఆర్డర్ ఇస్తారంటూ చెప్పారు. మొత్తానికి, టాపింగ్ లేని పిజ్జా క్లిప్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.