Viral video : ఒంటరిగా వెళ్తున్న బాలిక.. అకస్మాత్తుగా ఓ గోల్డెన్ ఈగల్ దాడి చేయగా..!

అదొక నిర్మానుష్య ప్రాంతం. ఓ ఖాళీ ప్రదేశంలో కొన్నికార్లు నిలిచి ఉన్నాయి. తెల్లటి గౌను ధరించిన ఓ బాలిక అక్కడికి నడుచుకుంటూ వస్తోంది.

Update: 2024-08-21 08:15 GMT

దిశ, ఫీచర్స్ : అదొక నిర్మానుష్య ప్రాంతం. ఓ ఖాళీ ప్రదేశంలో కొన్నికార్లు నిలిచి ఉన్నాయి. తెల్లటి గౌను ధరించిన ఓ బాలిక అక్కడికి నడుచుకుంటూ వస్తోంది. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అలా నడుస్తూ వచ్చిన బాలికపై ఓ పెద్ద గోల్డెన్ ఈగల్ దాడి చేసింది. వెంటనే కిందపడిపోయిన బాలిక దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ డేగ ఎంతకీ వదలట్లేదు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. ఓ మైదాన ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో కొన్నికార్లు ఆగి ఉన్నాయి. అక్కడ తెల్లటి గౌను ధరించిన ఓ బాలిక ఆడుకుంటోంది. కాగా ఆమె నడుచుకుంటూ వస్తుండగా.. పై నుంచి ఒక్కసారిగా వచ్చిన పెద్ద గోల్డెన్ ఈగల్ బాలికపై అకస్మాత్తుగా దాడిచేసింది. ఆ బాలిక భయంతో తప్పించుకునే ప్రయత్నం చేసినా వదల్లేదు. అయితే అక్కడికి కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులు ఇది గమనించారు. హుటా హుటిన అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి డేగ దాడి నుంచి బాలికను కాపాడారు.

ప్రజెంట్ బాలికపై దాడి చేసిన డేగకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చూస్తేనే భయంగా అనిపిస్తోందంటూ పలువురు రియాక్ట్ అవుతున్నారు. కాగా పరిస్థితి చూస్తుంటే అది రియల్ దాడి కాదని, ఏదో మూవీ షూటింగ్ చిత్రీకరణలో భాగంగానో లేదా డేగతో విన్యాసాలు చేయించే సందర్భంలోనో ఈ సంఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రజెంట్ ఇది ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. 

Video Credits to Page postinganimalattacks Insta Id

Tags:    

Similar News