Viral : సముద్రంలో విహరిస్తూ ఆ పనిచేశారో అంతే సంగతులు.. ఆ దేశంలో ఏం చేస్తారంటే..

అందమైన బీచ్‌లలో విహరిస్తూ, అలల సవ్వడిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడపడానికి చాలా మంది టూరిస్టులు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. స్టీమర్లలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

Update: 2024-07-08 06:47 GMT

దిశ, ఫీచర్స్: అందమైన బీచ్‌లలో విహరిస్తూ, అలల సవ్వడిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడపడానికి చాలా మంది టూరిస్టులు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. స్టీమర్లలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. స్విమ్మింగ్ ఏరియాలో ఈతకొడుతూ సరదా.. సరదాగా గడుపుతుంటారు. అయితే ఈ సందర్భంగా కొందరు నీటిలో మూత్ర విసర్జన కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది కాలుష్యానికి దారితీస్తుందని, ఇతరుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని సముద్రంలో అలా చేయడానికి వీల్లేదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ ఆ ప్రాంతమేది?,  ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటున్నారో చూద్దాం.

అది స్పెయిన్‌ దేశం‌లోని మార్బెల్లా ప్రాంతం. ఇక్కడికి దగ్గరలోని సముద్రంలో,  వివిధ బీచ్‌లలో విహరించడానికి దేశ విదేశాల నుంచి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. కాగా వారు నీటిలో విహరిస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేస్తుంటారనే ఫిర్యాదులు తరచుగా వస్తుండటంతో మార్బెల్లా నగరపాలక సంస్థ పర్యాటక విభాగం అధికారులు స్పందించారు. ఇక నుంచి ఆ పని చేసేవారికి జరిమానా విధిస్తామని ప్రకటన జారీ చేశారు. ఎవరైనా ఇక్కడి నీటిలో యూరిన్ చేస్తే ఫస్ట్ టైమ్ జరిమానా కింద రూ. 67,000 జరిమానా, ఏడాదిలోపు అదే వ్యక్తి మళ్లీ అదే పనిచేస్తే రూ. లక్ష వరకు ఫైన్ వేస్తామని ఆఫీసర్లు స్పష్టం చేశారు.

కాగా ఈ నిబంధనలపై స్థానికుల్లో అనుమానాలు, వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుండగా చివరికి ప్రభుత్వం కూడా స్పందించి వివరణ ఇవ్వాల్చి వచ్చిందట. ఏంటంటే.. బీచ్‌లలో నిలబడి సముద్రంలోకి మూత్ర విసర్జన చేసేవారికి, అలాగే బ్యాక్ వాటర్‌ను కలుషితం చేసేవారికి మాత్రమే ఈ జరిమానా వర్తిస్తుందని చెప్పింది. ఇదిలా ఉండగా.. అసలు నిందితులను ఎలా గుర్తిస్తారు?, ఇది సాధ్యమేనా? అంటూ పలువురు నెటిజన్లు సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఎంత వరకు నిజమో కానీ ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా అవుతోంది. 


Similar News