Viral : జస్ట్ మూడు నిమిషాలే కౌగిలించుకోండి..! అంతకు మించితే..

Viral : జస్ట్ మూడు నిమిషాలే కౌగిలించుకోండి..! అంతకు మించితే..

Update: 2024-10-21 06:13 GMT

దిశ, ఫీచర్స్ : కౌగిలింతను ప్రతి ఒక్కరూ ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు నిదర్శనంగా భావిస్తారు. పిల్లలు, పెద్దలు తమ ప్రియమైన వారిని మనసారా హగ్ చేసుకొని భావోద్వేగానికి లోనవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఎయిర్ పోర్టుల్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. విదేశాలకు వెళ్లే తమ వారిని సాగనంపడానికి అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ చివరి సారిగా వీడ్కోలు పలుకుతూ ప్రేమగా హగ్ చేసుకుంటారు. ఇది సహజమైన ప్రక్రియే కాకుండా మానవ సంబంధాల్లో ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రియమైన వారిని కౌగిలించుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పరు. కానీ ఒక దేశంలోని ఎయిర్ పోర్ట్‌లో మాత్రం అధికారులు అభ్యంతరం చెప్తున్నారు. పైగా ఒక వ్యక్తి 3 నిమిషాలకు మించి హగ్ చేసుకోవడం తగదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

వైరల్ సమాచారం ప్రకారం.. అది న్యూజిలాండ్‌లోని డ్యునెడిల్ ఎయిపోర్ట్. అక్కడికి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. వారికి వీడ్కోలు చెప్పడానికి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా గుంపులు గుంపులుగా వస్తుంటారు. అయితే ఎక్కువమంది రావడం, విదేశాలకు వెళ్లే వ్యక్తికి వీడ్కోలు పలికే సమయంలో ప్రతీ ఒక్కరు హగ్ చేసుకోవడం కారణంగా అక్కడ రద్దీ వాతావరణం నెలకొంటోంది. దీంతో ఎయిర్ పోర్ట్ పని వాతావరణానికి, ప్రశాంతతకు, ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఆటకం కలుగుతోందని గుర్తించిన అధికారులు ఓ కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఏంటంటే.. ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఎవరు కూడా తమ ప్రియమైన వారిని 3 నిమిషాలకు మించి కౌగిలించుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లలో పాజిటివ్‌గా కొందరు, నెగెటివ్‌గా కొందరు రియాక్ట్ అవుతున్నారు.  

Tags:    

Similar News