viral : రెండేండ్లుగా షిప్‌లోనే నివసిస్తున్న యువతి.. చివరికి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి..
కుటుంబంతో జీవించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలెన్ హార్డీ మాత్రం రెండేండ్లుగా ఓ క్రూయిజ్ షిప్‌లోనే నివసిస్తోంది.
దిశ, ఫీచర్స్ : లైఫ్ అంటే ఏమిటి?, ఎలా జీవించాలి? అనే ప్రశ్నకు అందరి వద్దా ఒకే సమాధానం ఉండదు. ఇది వ్యక్తిగత ఆసక్తులు, అవసరాలను బట్టి కూడా ఉంటుంది. పైగా ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. నేటి ఆధునిక యుగంలో అయితే ‘బెస్ట్ లైఫ్’ అనే కాన్సెప్ట్‌కు స్థిరమైన నిర్వచనాలేమీ లేవు. ఎవరికి నచ్చినట్లు వారు జీవించడమే అన్నింటికంటే బెస్ట్ అనుకుంటున్నారు చాలామంది. అలాంటి వారిలో ఇంగ్లాండ్‌కు చెందిన 23 ఏండ్ల ఎలెన్ హార్డీ ఒకరు.
పడవలోనే అన్నీ..
మంచి ఇల్లు కట్టుకోవాలని, అందులో కుటుంబంతో సంతోషంగా జీవించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలెన్ హార్డీ మాత్రం రెండేండ్లుగా ఓ క్రూయిజ్ షిప్‌లోనే నివసిస్తోంది. పైగా ఆమెకు ఇటీవల షిప్‌లోనే ఓ వ్యక్తి పరిచయమై బాయ్ ఫ్రెండ్‌గా మారిపోయాడట. ఇద్దరూ కలిసి పడవ ప్రయాణంలో విహరిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. నీటిమార్గం ద్వారా సాధ్యమయ్యే కొన్ని దేశాలను కూడా చుట్టి వచ్చారు.
ఎలా సాధ్యం?
బయట జీవించాలన్నా, షిప్లో జీవించాలన్నా మనిషికి ఉపాధి, డబ్బు, ఆహారం వంటివి తప్పనిసరి. మరి ఎలెన్ హార్డీ షిప్లో ఎలా నివసించగలుగుతుంది? అంటే.. ఆమె క్రూయిజ్ షిప్‌లోనే 2022 నుంచి డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఆ తర్వాత మరో క్రూయిజ్‌కు మారిన ఎలెన్ అక్కడ కూడా తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో రోజుకూ 3000 మంది ప్రయాణికులను అలరిస్తూ డబ్బు సంపాదిస్తోంది. ఇదే వృత్తిగా ఎంచుకొని జీవిస్తోంది.
అనుకోకుండా ఒకరోజు
అనుకోకుండా ఒక రోజు ఎలెన్ హార్డీ క్రూయిజ్‌షిప్ జర్నీలో ఉండగా సింగపూర్‌కు చెందిన 28 ఏళ్ల లూయిస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రజెంట్ అతను కూడా క్రూయిజ్ సిబ్బందిలో ఒకడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ షిప్లో ఉద్యోగాలు చేస్తారు కాబట్టి పర్మినెంట్‌గా అందులోనే జీవించాలనుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ‘నైన్ డే’ పేరు గల క్రూయిజ్‌లో నివసిస్తున్నారు. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నచ్చినట్లు జీవించడమే నిజమైన లైఫ్ అంటూ కొందరు తెగ పొగిడేస్తున్నారు.
Read More..
Period problems: పెళ్లి తర్వాత మహిళల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ .. కారణాలు ఇవే అంటున్న నిపుణులు!