Viral Video : ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఆ ఊరిలో కేవలం ఒకే ఒక్క మహిళ నివసిస్తోంది!

ఒక ఊరంటే ఎలా ఉంటుంది?. ఎంత కాదన్నా కనీసం రెండు మూడు వేలమంది నివసిస్తుంటారు. కానీ ఆ ఊరిలో మాత్రం..

Update: 2024-08-17 06:34 GMT

దిశ, ఫీచర్స్ : ఒక ఊరంటే ఎలా ఉంటుంది?. ఎంత కాదన్నా కనీసం రెండు మూడు వేలమంది నివసిస్తుంటారు. ఏ మారుమూల గిరిజన గ్రామాలో, గూడేలో అయితే ఆ సంఖ్య వందల్లోనో, పదుల్లోనో ఉండవచ్చు. కానీ కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే నివసించే గ్రామం ఉంటుందంటే నమ్ముతారా?.. కానీ ఇది నిజం. ఆ గ్రామం పేరు మోనోవి. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉంది. ప్రజెంట్ ఓన్లీ వన్ పర్సన్ నివసిస్తున్న ఈ గ్రామం గురించిన వార్త ఒకటి నెట్టింటల్ హల్ చల్ చేస్తుండగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మోనోవి గ్రామం ప్రపచంలోనే అతి చిన్నదని పర్యాటక నిపుణులు చెప్తున్నారు. మొత్తం 54 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ఊరిలో 1930లో 123 మంది నివాసం ఉండేవారట. కాగా 2010 నుంచి ఈ గ్రామం క్రమంగా ఖాళీ అవుతూ వచ్చిందని, ఉపాధి, ఉద్యోగాల కోసం అందరూ పట్టణాలకు వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తుంటారు.

మోనోవి గ్రామం నుంచి అందరూ వెళ్లిపోగా చివరికి 2000 సంవత్సరం నాటికి ఎల్సీ - రూడీ పేర్లు గల దంపతులు మాత్రమే నివాసం ఉండేవారు. కాగా 2004లో రూడీ కూడా మరణించడంతో వృద్ధురాలు ఎల్సీ ఒంటరై పోయింది. అయినా ఆ ఊరిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది. తన పనులు తానే చేసుకోవడంతోపాటు ఊరి పరిశుభ్రత, ఇతర పనులు కూడా చేస్తోందట. కాగా ఒకే వ్యక్తి నివసిస్తున్న గ్రామంగా చుట్టు పక్కల ప్రసిద్ధి చెందడంతో ఆ ఊరిని చూడ్డానికి పర్యాటకులు వచ్చి పోతుంటారని టూరిస్ట్ నిపుణులు చెప్తున్నారు. 

Full View

Video Credits To Thercornbel Insta Id

Tags:    

Similar News