మలబద్దకాన్ని నివారించే అద్భుత చికిత్స ‘వైబ్రేటింగ్ స్మార్ట్ పిల్స్’

వైబ్రంట్ అనేది ఒక స్మార్ట్ ఇన్‌జెస్టబుల్ క్యాప్సూల్

Update: 2023-02-26 08:26 GMT

దిశ, ఫీచర్స్ : వైబ్రంట్ అనేది ఒక స్మార్ట్ ఇన్‌జెస్టబుల్ క్యాప్సూల్. ఇది జీర్ణ క్రియను మెరుగు పర్చి, పెద్ద ప్రేగును శుభ్రపర్చి, సాధారణ మల బద్దకాన్ని, దీర్ఘకాలిక మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి ఇతర మెడిసిన్స్ అవసరం లేకుండా, కేవలం వైబ్రంట్ పిల్స్ ద్వారా మాత్రమే మల బద్దకం సమస్యను నివారించుకునేందుకు ఈ పిల్స్ ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రేగుల కదలికల ఫ్రీక్వెన్సీని పెంచడానికి కూడా ఈ పిల్స్ దోహద పడతాయి.

జీవనశైలి ప్రభావం

చాలామంది తమకు ఎదురవుతున్న మలబద్దకం సమస్య గురించి మాట్లాడటానికి ఇష్టపడరు కానీ, అది కూడా వ్యక్తులను ఇబ్బందలకు గురిచేసే తీవ్ర అనారోగ్య సమస్యే. దీర్ఘకాలిక మలబద్దకం అనేది ఈరోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వయస్సు పెరిగే కొద్ది జీర్ణ క్రియలో మార్పులు, అన్ హెల్తీ లైఫ్ స్టయిల్, తీసుకునే ఆహారం, జన్యు సంబంధిత సమస్యలు మలబద్దకం సమస్యకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పీడిస్తున్న సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి. వ్యాయామం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంవల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు కానీ చాలామంది ఇటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.

ఇడియోపతిక్ అనే దీర్ఘకాలిక మలబద్దకంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సమస్య ఉన్న వారు సాధారణ చికిత్సలతో ఉపశమనం పొందే అవకాశం తక్కువ. మొదట్లోనే తగిన నివారణ చర్యలు, చికత్స తీసుకోకపోతే పెద్దప్రేగును క్లియర్ చేయడానికి తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెప్తుంటారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం వైబ్రేటింగ్ క్యాప్సూల్ రూపంలో ఔషధ రహిత ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉండటం సంతోషం కలిగించే విషయంగా వారు పేర్కొంటున్నారు.

నిద్రకు ముందు 5 మాత్రలు

వైబ్రంట్ క్యాప్సూల్ అనేది మెడికల్ ఎక్విప్ మెంట్ మానుఫాక్చరర్ వైబ్రెంట్ గ్యాస్ట్రో (made by medical equipment manufacturer Vibrant Gastro) ద్వారా తయారు చేయబడిన మొట్టమొదటి రకం చికిత్స. ఈ క్యాప్సూల్స్‌ను డాక్టర్ల సూచనతో వారానికి ఐదు రాత్రులు నిద్రపోయేకంటే ముందు మింగాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ మాత్రలు చేతితో ఎలా పడితే అలా తాకవద్దు. తప్పనిసరిగా ప్యాకేజీలో వచ్చే ప్యాడ్‌తో వాటిని తీయడం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మింగడం చేయాలి. ఎందుకంటే అవి రెండు గంటల పాటు వైబ్రేట్ అయ్యేలా ముందే ప్రోగ్రామ్ చేయబడిన క్యాప్సూల్స్. తర్వాత అవి మరో ఆరు గంటల పాటు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. ఆ తర్వాత మళ్లీ పనిచేయడం ప్రారంభించి రెండుగంటలపాటు ప్రభావాన్ని చూపుతాయి.

గట్స్ నరాలపై ప్రభావం

‘‘మాత్రలు మెకనోసెన్సరీ సెల్స్’’ అని పిలవబడే గట్‌లోని ప్రత్యేక నరాల కణాలను ప్రేరేపిస్తాయి’’ అని వైబ్రంట్ గ్యాస్ట్రోలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బెన్ ఫెల్డ్‌మాన్ పేర్కొన్నారు. ‘‘ఇవి పెరిస్టాల్సిస్‌ను ప్రేరేపించడంలో సహాయపడతాయని, గట్ ద్వారా ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే కండర సంకోచాలను ప్రేరేపిస్తాయని చెప్పారు. మెకానికల్ స్టిమ్యులేషన్ కు సంబంధించి ప్రీ ప్రోగ్రామ్ చేసిన టైమింగ్ ఆధారంగా శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ, ప్రధానంగా పెద్దప్రేగు పనితీరు మెరుగు పడుతుంది.

వైబ్రెంట్ క్యాప్సూల్స్ ను యూజ్ చేసినప్పుడు అవి యూజర్ ప్రేగు గుండా వెళుతున్నప్పుడు సున్నితంగా కంపిస్తాయి.చివరికి ప్రేగు కదలికల ద్వారా తొలగిపోతాయి. మూడవ దశ మెడికల్ ట్రయల్‌లో పాల్గొనే కొద్దిమంది మాత్రలు కంపించినట్లు అనిపించిందని పేర్కొన్నట్లు నిపుణులు చెప్పారు. అయితే ఈ అనుభూతిని ఎవరూ అన్ కన్‌ఫర్టబుల్‌గా ఫీలవ్వలేదని చెప్పారు.

ప్రయోజనమెంత?

గ్యాస్ట్రో ఎంటరాల జిస్టులు ఉపయోగించే కెమెరా పిల్స్ (camera pills) మాదిరిగానే మెడికల్- గ్రేడ్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ క్యాప్సూల్స్ క్రానిక్ (దీర్ఘకాలిక) ఇడియోపతిక్ మలబద్ధకానికి చికిత్స, తప్ప నివారణ కాదు. ఒక చిన్న మెడికల్ ట్రయల్‌లో భాగంగా పరిశీలించినప్పుడు సాధారణ మలబద్ధకం నివారణ మాత్రలు 23 శాతం మందికి ప్రయోజనం చేకూర్చగా, వైబ్రేటింగ్ క్యాప్సూల్స్ మాత్రం 40 శాతం మందికి మేలు చేశాయని, వైబ్రేటింగ్ క్యాప్సూల్స్ వల్ల ప్రేగుల్లో అదనపు కదలికలు మొదలై జీర్ణక్రియ సక్రమంగా పనిచేసిందని ట్రయల్‌ను పర్యవేక్షించిన వైద్య నిపుణులు చెప్తున్నారు. సాధారణ మాత్రలు వాడకంతో మలబద్ధకం ప్రాబ్లం సాలో అయిన సమూహంలో 12 శాతం మంది వ్యక్తులతో పోలిస్తే, వైబ్రాంట్‌ను ఉపయోగించిన వారిలో 23 శాతం మంది వ్యక్తులు అధిక ప్రయోజనం పొందారు. వీరిలో ప్రేగుల కదలికలు, జీర్ణక్రియ శక్తి మెరుగు పడింది.

ఒక నెల క్యాప్సూల్స్ ధర రూ. 7380.37

ఒక నెల బైబ్రెంట్ క్యాప్సూల్స్ వాడితే చాలు. ఇతర మందులు, చికిత్సలు అవసరం లేకుండా ప్రాబ్లం సాలో అవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం పూర్తిగా తొలగిపోతుది కాబట్టి వైబ్రేటింగ్ క్యాప్సూల్స్ FDA ద్వారా ఆమోదించబడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక నెల కోసం కావాల్సిన క్యాప్సూల్స్ ధర రూ. $89 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 7380.37. ప్రస్తుతం సాంప్రదాయ మలబద్ధకం ఉపశమన చికిత్సల కంటే కూడా ఖరీదైనదిగా ఉంది. అయితే వైబ్రాంట్ గ్యాస్ట్రో వాణిజ్య ప్రణాళికల్లో కవరేజీని పొందేందుకు బీమా కంపెనీలతో కలిసి పని చేయడం ద్వారా దీన్ని మరింత సరసమైన ధరలకు అందించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నది. దీంతో భవిష్యత్తులో మెరుగైన మలబద్ధక నివారణ చికత్సలో వైబ్రెంట్ క్యాప్సూల్ స్థానం సంపాదించుకునే అవకాశం ఉందని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News