ఇటీవల పాపులర్ అవుతున్న వెగన్ డైట్.. ఆరోగ్యానికి మంచిదేనా?

గ్లామర్ ప్రపంచంలో డైటింగ్ ట్రెండ్స్ ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నాయి. అట్లాంటిక్ డైట్, వెస్ట్రన్ డైట్, ఇండియన్ డైట్ ఇలా రకరకాల ఆహారపు అలవాట్లు గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు.

Update: 2024-04-02 07:11 GMT

దిశ, ఫీచర్స్ : గ్లామర్ ప్రపంచంలో డైటింగ్ ట్రెండ్స్ ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నాయి. అట్లాంటిక్ డైట్, వెస్ట్రన్ డైట్, ఇండియన్ డైట్ ఇలా రకరకాల ఆహారపు అలవాట్లు గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో వెగన్ డైట్ గురించి డిస్కషన్ నడుస్తోంది. కొరియన్ బ్యూటీ ట్రెండ్‌ మాదిరిగానే, వెగన్ డైట్‌ ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ వెగన్ డైట్ అంటే ఏమిటి? పాటించడం మంచిదా.. కాదా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

వెగన్ డైట్ లేదా వెగనిజం అనేది వెజిబేబుల్ పదం నుంచి పుట్టొచ్చింది. ఇది కేవలం ఒక డైట్ మాత్రమే కాదు, శాకాహారానికి సంబంధించిన ఒక లైఫ్‌స్టైల్ అని కొందరు పేర్కొంటున్నారు. దుస్తులు, ఆహారం, మానవ అవసరాలు తీర్చే ఏ ప్రయోజనం కోసం అయినా జంతువులను హింసించ కూడదనే తత్వశాస్త్రం ఇందులో ఉందని నిపుణులు చెప్తున్నారు. అంటే జంతువులకు సంబంధించిన పదార్థాలు ఏవీ వాడకుండా, అచ్చం మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడమే ఈ డైట్ లేదా కల్చర్‌ యొక్క ప్రత్యేకత. ఇటీవల చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ లేకుండా ఉండే వెగన్ డైట్ వల్ల జాగ్రత్తలు పాటించకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చునని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో కేవలం పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇలా మొక్కల ఆధారిత ఆహార పదార్థాలే ఉంటాయి. జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, మాసం వంటివి అస్సలు ఉండవు. దీంతో వెగన్ డైట్ పాటించేవారు మాంసాహారం, పాల ఉత్పత్తుల ద్వారా లభించే ప్రోటీన్లను కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థఇతి రాకుండా పప్పు ధాన్యాలు, నట్స్ వంటివి తీసుకోవాలి.

అలాగే వెగన్ డైట్ ఫాల్లో అయ్యేవారిలో విటమిన్ బి12 లోపం ఏర్పడవచ్చు. దీనిని భర్తీ చేయడానికి వారికి సప్లిమెంట్స్ అవసరం కావచ్చు. అలాగే శరీనానికి బలాన్ని ఇచ్చే వాటిలో ఐరన్ ముఖ్యం. ఇందులో హెమీ ఐరన్, నాన్ హెమీ ఐరన్ అని రెండు రకాలుగా ఉంటాయి. వెగన్ డైట్‌లో కేవలం నాన్ హెమీ ఐరన్ మాత్రమే ఉంటుంది. హెమీ ఐరన్ జంతు ఆధారిత ఆహారంలోనే లభిస్తుంది. ఈ అసమతుల్యతను భర్తీ చేయడానికి వెగన్ డైటిస్టులు హెమీ ఐరన్ లభించే సన్ ఫ్లవర్ సీడ్స్, ఎండు ద్రాక్ష, మిరర్చి, బ్రోకలీ, కాల్షియం కోసం ఆల్మండ్స్, సోయాబీన్ వంటివి రెగ్యులర్‌గా వాడాలి.

మెదడు, హార్ట్ హెల్త్ కోసం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇవి ఎక్కువగా చేపల్లో లభిస్తాయి. వెగన్ డైటర్స్ చేపలు తినరు కాబట్టి ఆ లోటు భర్తీ చేయడానికి వాల్ నట్స్, ఫ్లాక్ సీడ్స్ వంటివి తీసుకుంటే భర్తీ చేయవచ్చు. అయితే వెగనిజం పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాదన కూడా ఉంది. ఎందుకంటే కేవలం శాకాహారం తీసుకోవడం, జంతు ఆధారిత ఆహారాలైన పాలు, మాంసం, గుడ్లు వంటివి తీసుకోపోవడం కారణంగా అవసరమైన ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ లభించవు. కాబట్టి వెగన్ డైటిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లను భర్తీ చేయడానికి అవి పుష్కలంగా లభించే శాకాహారాన్ని సమృద్ధిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More..

వేసవిలో తాజాగా ఉండాలనుకుంటున్నారా.. ఇంట్లోనే ఈ పెర్ఫ్యూమ్ తయారు చేసుకోండి..  


Similar News