గ్యాస్‌కు సంబంధించి ట్యాబ్లెట్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ప్రస్తుత రోజుల్లో మనుషులను ఎక్కువగా బాదిస్తున్న్న సమస్యలో గ్యాస్ సమస్య ఒకటి

Update: 2024-02-21 06:07 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో మనుషులను ఎక్కువగా బాదిస్తున్న్న సమస్యలో గ్యాస్ సమస్య ఒకటి. ఈ కారణంగా ఏం తినాలన్నా, తాగాలన్నా భయమే. ఈ సమస్య వల్ల కడుపులో గ్యాస్ తయారై చెస్ట్ పెయిన్, స్టమక్ పెయిన్ మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు పెద్దపేగు క్యాన్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్య మధ్య సంబంధం ఉందని నిపుణులు చెబుతుంటారు. పెద్దపేగు క్యాన్సర్‌లో‌ గ్యాస్ట్రిక్‌, తిమ్మిర్‌, కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైం కు ఆహార నియమాలు పాటించని వారికి, గంటల తరబడి ఒకే చోట కూర్చుని వర్క్ చేసేవారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బారిన పడతారు. దీంతో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ నుంచి బయటపడేందుకు ఉదయం పూట ఖాళీ కడుపుతో టాబ్లెట్స్ మింగుతారు. కొంతమంది ఈ మందులకు ప్రతిరోజూ వాడుతుంటారు. ఇలాంటి వారికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ ఉందని, సైడ్ ఎఫెక్ట్స్ తప్పనిసరంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గ్యాస్ టాబ్లెట్స్‌తో తలెత్తే సమస్యలు

* వ్యక్తి బలహీనంగా మారడం.

అపానవాయువు, గ్యాస్ ఏర్పడటం

* నోరు పొడిబారడం

* అతిసారం

ఫ్లూ

వెన్నునొప్పి

నివారణలు

* గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే సోంపు అధికంగా తీసుకోండి. క్రమం తప్పకుండా రోజూ పడిగడుపున సోంపు తిన్నట్లైతే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. సోంపు గ్యాస్ సమస్యను ఈజీగా నయం చేస్తుంది.

* అలాగే ఫుడ్ టైమ్‌కు తీసుకోవాలి.

* 7 నుంచి 8 గంటలు నిద్రించండి.

* కొబ్బరి నీళ్లు, మజ్జిక, పెరుగు, లస్సీ ఎక్కువగా తాగండి.

* పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

* తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయాలి. వెంటనే పడుకోకూడదు.

* వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.


Similar News