ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్‌తో టేస్టీ హల్వా.. ఇలా చేయండి..

హల్వా అనేది భారతీయ తీపి వంటకాల్లో ఒకటి.

Update: 2024-11-15 12:46 GMT

దిశ, ఫీచర్స్: హల్వా అనేది భారతీయ తీపి వంటకాల్లో ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన రుచి, రంగును కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో చేయడానికి ఏమీ లేనప్పుడు కస్టర్డ్ పౌడర్‌తో, తక్కువ సమయంలోనే టేస్టీ హల్వాను రెడీ చేయండి. కస్టర్డ్ హల్వా ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివేయండి.

కావల్సిన పదార్థాలు:

వెనీలా కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు

పంచదార - 2 కప్పులు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్‌లు

కొద్దిగ యాలకుల పొడి

ఎండు ద్రాక్ష, జీడిపప్పు

తయారీ విధానం:

ఒక గిన్నెలో 1 కప్పు కస్టర్డ్ పౌడర్‌ను వేసి కొద్దిగా నీరు పోసి కొంచెం చిక్కగా కలుపుకోవాలి. తరువాత కొంచెం నెయ్యిలో ఎండుద్రాక్ష, జీడిపప్పును వేసి లైట్‌గా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో పంచదార వేసి, దానికి సరిపడా 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. పంచదార కరిగిన తరువాత మంటను తగ్గించి, అందులో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ను వేసి, 15 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. కాస్త చిక్కగా మారిన తరువాత అందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ హల్వా బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. అందులో యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న ఎండుద్రాక్ష, జీడిపప్పు ముక్కలు వేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యితో కలిపిన ఒక ప్లేట్‌లో వేసి, కొంచెంసేపు అలాగే వదిలేయాలి. అంతే టేస్టీగా ఉండే కస్టర్డ్ హల్వా రెడీ.

Tags:    

Similar News