భోజనం తరువాత స్వీట్లు తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
ఈ రోజుల్లో చాలామందికి రుచికరమైన భోజనం తరువాత డెజర్ట్ తినే అలవాటు ఉంటుంది.
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామందికి రుచికరమైన భోజనం తరువాత డెజర్ట్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వివాహ వేడుకలల్లో లేదా సంతోషకరమైన సందర్భాల్లో భోజనానికి ముందు లేదా తర్వాత సీట్లు ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇప్పుడు ఇది అలవాటుటగా మారింది. ప్రధానంగా గులాబ్ జామ్, జిలేబీ, రసగుల్ల వంటివి తింటుంటారు. కానీ, ఇలా భోజనం తరువాత స్వీట్లు తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో అధిక చక్కెర ఉండడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు. భోజనం తరువాత స్వీట్లు తినడం వల్ల అనవసరమైన బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. అధిక చక్కెర శరీరంలోని ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
జీర్ణ సమస్యలు: భోజనం తరువాత స్వీట్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుతుంది. ఇది అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు కారణం అవుతుంది. అందుకే భోజనం చేసిన వెంటనే స్వీట్లు తినకపోవడమే మంచిది.
పోషకాల లోపం: ప్రతి రోజూ భోజనం తరువాత స్వీట్లు తినే అలవాటు ఉండే ఇది పోషకమైన ఆహారం తీసుకోవడంపై ప్రభావం చూపుతుంది. సరైన ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు అందుతాయి. ఇలాంటి ఆహారం తిన్నప్పుడు స్వీట్స్ తినకపోవడమే ఉత్తమం.
నిద్రకు ఇబ్బంది: రాత్రి భోజనంలో ఎక్కువగా స్వీట్లు తింటే, అది నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. స్వీట్స్‌లో ఉన్న చక్కెర, రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
స్వీట్లు తినాలని అనిపించినప్పుడు రాత్రి కాకుండా సాయంత్రం వాటిని తినడం మంచిది. రాత్రి భోజనం చేసిన కొంత సమయం తరవాత కూడా మితంగా వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.