ఆల్కహాల్ తాగిన తర్వాత మెడిసిన్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
కొందరు మద్యం సేవించి కొన్ని తప్పులు చేస్తుంటారు.
దిశ,ఫీచర్స్: మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యువత కూడా ఈ మద్యానికి బానిసలుగా మారుతున్నారు. మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ఇదిలా ఉండగా, కొందరు మద్యం సేవించి కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా తాగిన తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. దీని వల్ల ఎలాంటి నష్టాలు కలగనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మద్యం సేవించిన తర్వాత మందులు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మద్యం సేవించిన తర్వాత మీరు ఇతర మందులతో ప్రతిస్పందిస్తారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మెడిసిన్స్ తీసుకున్నాక ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
కాబట్టి మద్యం సేవించిన తర్వాత మందులు తీసుకోవద్దు. మీరు ఆల్కహాల్ తాగినప్పుడు, అది కనీసం 25 గంటల పాటు శరీరంలో ఉంటుందట. కొందరు మద్యం సేవించిన తర్వాత ఏవి పడితే అవి తీసుకుంటారు. మరి కొందరు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఇలా చేస్తే శరీరం బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా వాంతులు, తల తిరగడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల కాలేయ వ్యాధి, అల్సర్ సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు తాగిన రోజు మెడిసిన్స్ కు దూరంగా ఉండండి.