ఉపవిష్ట కోణాసనం.. ప్రయోజనాలు
కొద్దిగా వార్మప్ చేసిన తర్వాత రెండు కాళ్లను 120 డిగ్రీలలో స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్లను పట్టుకుని..
కొద్దిగా వార్మప్ చేసిన తర్వాత రెండు కాళ్లను 120 డిగ్రీలలో స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్లను పట్టుకుని.. మెల్లిగా బాడీని ముందుకు తీసుకొచ్చి నేలపై ఆన్చాలి. ఈ పొజిషన్లో రెండు కాళ్ల వేళ్లను మనవైపు లాగాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత చేతుల సాయంతో కాళ్లను పైకెత్తి బాడీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ స్థితిలో వీలైనంత సేపు శ్వాస ఆపేందుకు ప్రయత్నించాలి. తర్వాత మెల్లిగా శ్వాసను వదులుతూ రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు :
* నడుము, తొడ కండరాలకు రిలాక్సేషన్ లభిస్తుంది.
* తలలో రక్తప్రసరణ బాగుంటుంది.
* కాలేయం, మూత్రపిండాలను స్టిమ్యులేట్ చేస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.