ఈ నెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తోన్న సిద్దాంతకర్తల సాక్ష్యాలు.. రక్తచంద్రుడు కనిపిస్తే ఖతమేనా..?

ఈ నెల 28న భూమి అంతం కాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆరు పెద్ద గ్రహశకలాలు( Asteroids) భూమి(Earth) ఢీకొంటాయని డూమ్స్‌డే సిద్ధాంతకర్తలు పేర్కొన్నారు. వీటిలో అతిపెద్దది 2.5 మైళ్ల వెడల్పుతో ఉంటుందని అంచనా. కాగా

Update: 2024-09-06 07:55 GMT

దిశ, ఫీచర్స్ : ఈ నెల 28న భూమి అంతం కాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆరు పెద్ద గ్రహశకలాలు( Asteroids) భూమి(Earth) ఢీకొంటాయని డూమ్స్‌డే సిద్ధాంతకర్తలు పేర్కొన్నారు. వీటిలో అతిపెద్దది 2.5 మైళ్ల వెడల్పుతో ఉంటుందని అంచనా. కాగా కరేబియన్ ద్వీపం ప్యూర్టో రికోలో దీని ప్రభావం విధ్వంసానికి దారితీస్తుందని చెప్తున్నారు.

కాగా ఈ ఈ అంచనాలు "బ్లడ్ మూన్ ప్రోఫెసీ"తో ముడిపడి ఉన్నాయి, 18 నెలల వ్యవధిలో బ్లడ్ మూన్స్ అని పిలువబడే నాలుగు చంద్ర గ్రహణాల ముగింపు తర్వాత ప్రపంచం నాశనం చేయబడుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. డూమ్స్‌డే వాదనలకు ఆజ్యం పోస్తూ సెప్టెంబర్ 28న చివరి బ్లడ్ మూన్ కనిపిస్తాడని అంచనా వేయబడింది. ఈ నమ్మకాన్ని వ్యాప్తి చేసిన రెవరెండ్ ఎఫ్రాయిడ్ రోడ్రిగ్జ్.. భూమిని తాకిన గ్రహశకలం సృష్టించిన విధ్వంసం తన దృష్టితో ఆల్రెడీ చూశానని చెప్తున్నాడు. దీని ప్రభావం వల్ల 12 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందని నాసాను హెచ్చరించాడు.

అయితే నాసా ఈ అంచనాలను తోసిపుచ్చింది. ఆ తేదీ లేదా ఏ సమయంలోనైనా గ్రహశకలం ప్రభావం గురించి ఆలోచనకు మద్దతు ఇచ్చే శాస్త్రీయ ఆధారాలు లేదా డేటా లేదని స్పష్టం చేసింది. అటువంటి విధ్వంసం కలిగించేంత పెద్ద ఖగోళ వస్తువు భూమిని ఢీకొనే మార్గంలో ఉంటే, పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా ఇప్పటికే కనుగొనబడి ఉండేదని చెప్పింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చింది. సమీప భవిష్యత్తులో పెద్ద గ్రహశకలం ముప్పు భూమికి లేదని క్లారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News