వాహనదారులకు అలర్ట్.. ఇకపై ‘టైర్ టాక్స్’..
వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో UKలోని వాహనదారులు త్వరలో ‘టైర్ టాక్స్’ చెల్లించాల్సి ఉంటుంది.
దిశ, ఫీచర్స్: వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో UKలోని వాహనదారులు త్వరలో ‘టైర్ టాక్స్’ చెల్లించాల్సి ఉంటుంది. 1996 నుంచి UKలో కార్ల నుంచి వెలువడే ఎగ్జాస్ట్ ఉద్గారాలు 90 శాతం తగ్గాయని ప్రభుత్వం నివేదించింది. దహన ఇంజిన్ వాహనాలు దశలవారీగా తొలగించగా ఇది సాధ్యమైందని, తదుపరి మార్గం టైర్ అండ్ బ్రేక్ వేర్ అని తెలిపింది. లండన్ ఇంపీరియల్ కాలేజ్ అధ్యయనం ప్రకారం.. 2021లో రోడ్డు రవాణాలో 52 శాతం చిన్న రేణువుల కాలుష్యం టైర్ అండ్ బ్రేక్ వేర్ నుంచి వచ్చిందని అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6 మిలియన్ టన్నుల టైర్ వేర్ పార్టికల్స్ విడుదలవుతున్నాయని గుర్తించింది. ఈ కణాలలో విష రసాయనాలు, భారీ లోహాలు ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్తలు.. మానవ వెంట్రుక వెడల్పు కంటే దాదాపు 2,000 రెట్లు చిన్నగా ఉండే ఇవి రక్తప్రవాహం ద్వారా అవయవాలలోకి ప్రవేశించగలవని హెచ్చరించారు. ఈ క్రమంలో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే UKలోని మోటరింగ్ సంస్థలు టైర్ పన్ను భద్రతపై ఎలా ప్రభావం చూపుతుందనే దాని గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. ‘టైర్ టాక్స్ అమలులోకి వస్తే డ్రైవర్స్ తక్కువ ధర కలిగిన, త్వరగా అరిగిపోయే టైర్లను యూజ్ చేస్తారని.. దీంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలకు కారణమవుతాయి. అధిక కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. చవకైన టైర్లను ట్యా్క్స్‌తో మరింత ఖరీదైనవిగా మార్చడం వలన కొందరు అక్రమ టైర్లతో డ్రైవింగ్ చేయడంలో సందేహం లేదు. తద్వారా ప్రతి ఒక్కరికీ రహదారి భద్రత కరువైనట్లే’ అని వ్యతిరేకతను వినిపించాయి.