'వర్క్ ఫ్రమ్ పబ్'.. ఎంప్లాయ్స్‌కు ఆఫర్ ఇచ్చిన బార్
పాండమిక్ తర్వాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఫెసిలిటీ కల్పించాయి.
దిశ, ఫీచర్స్ : పాండమిక్ తర్వాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఫెసిలిటీ కల్పించాయి. మొదట్లో ఈ కల్చర్ అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ రాను రాను ఈ తరహా వర్కింగ్ మోడ్ ఎక్కువ మందిలో బోరింగ్‌గా తయారైంది. ఈ నేపథ్యంలోనే యూకేలో ప్రస్తుతం 'వర్క్ ఫ్రమ్ పబ్(WFP)' అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంటి నుంచి పనిచేయడం పట్ల విసుగుచెందిన వారికి అక్కడి పబ్‌లు 'వర్క్ అండ్ ప్లే' ప్యాకేజీలను ప్రారంభించాయి. ప్రముఖ పబ్ 'యంగ్'.. యూకే వ్యాప్తంగా మెజారిటీ పబ్లిక్ హౌస్‌లలో వర్క్ ప్లేస్‌ను అందిస్తోంది. టెంప్టింగ్ డీల్‌లో రోజుకు రూ. 1,300 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ టీ, కాఫీతో పాటు శాండ్‌విచ్ కూడా ఆఫర్ చేస్తోంది.
కమ్యూనిటీ-బేస్డ్ వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్ కోసం ఉద్యోగులకు 'WFP' స్కీమ్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఇందులో పవర్ సాకెట్లు, నిశ్శబ్ద ప్రాంతాలు, షిఫ్ట్ ముగింపులో జిన్, టానిక్ లేదా పింట్ వంటి డ్రింక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 2020లో ప్రారంభించబడిన ఈ స్కీమ్ ప్రస్తుతం యంగ్‌కు చెందిన 185 పబ్‌లకు విస్తరించబడింది. ఇక కొంతమంది 'వర్క్ ఫ్రమ్ పబ్' కస్టమర్లు పబ్‌లో మరింత మతపరమైన వాతావరణాన్ని ఇష్టపడతారని చెప్పారు.
కరోనా వైరస్ మహమ్మారి, ఇంధన సంక్షోభం, జీవన వ్యయంల విషయంలో మిశ్రమ ప్రభావాలతో చాలా మంది బ్రిటన్ వాసులు పోరాడుతున్నందున యూకేలోని ఇతర పబ్‌లు కూడా ఇలాంటి ప్యాకేజీలనే అందించాయి. ఈ మేరకు 'ఫుల్లర్స్'.. తన 380 పబ్‌లలో రోజుకు కేవలం రూ. 900తో భోజనం, డ్రింక్స్ అందిస్తోంది. ఇదే ధరలో బ్రూహౌస్, కిచెన్ 'వర్క్‌స్పేస్' ఆప్షన్ కల్పిస్తోంది. ఇందులో WiFi, నిశ్శబ్ద ప్రదేశాలు, పవర్ సాకెట్స్, అన్‌లిమిటెడ్ హాట్, కూల్ డ్రింక్స్, ప్రింటింగ్ ఉన్నాయి. ఇక సర్రే, వేబ్రిడ్జ్‌లోని ఇండిపెండెంట్ ఫ్లింట్‌గేట్ పబ్ రూ. 1300కు 'వర్క్ అండ్ ప్లే డీల్' ఆఫర్ చేస్తోంది. ఇందులోనూ సేమ్ ఫీచర్స్ సహా సా. 5 గం.కు ఒక పింట్ లేదా G&T సన్‌డౌన్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి :