ఉగాది పంచాంగం : ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందంటే?
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తుంది. సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇక ఈరోజు ప్రజలందరూ కొత్త
దిశ, ఫీచర్స్ : తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తుంది. సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇక ఈరోజు ప్రజలందరూ కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా ఉగాది రోజు షడ్రుచులు, తీపి,పులుపు, ఉప్పు,కారం, చేదు, వగరు.. ఆరు రుచులు కలిపిన పచ్చడిని చేసుకుని కుటుంబ సభ్యులు మొత్తం తాగుతుంటారు. ఇక ఈరోజున పంచాంగ శ్రవణం విని, ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది. వారికి ఈ క్రోధినామ సంవత్సరం కలిసి వస్తుందా లేదా అని తెలుసుకుంటారు. కాగా, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి? ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం ఎక్కువగా ఉంటుందంట. ఈ సంవత్సరంలో ప్రజలు అధిక కోపం, ఆవేశంతో రగిలిపోతారని, కుటుంబసభ్యుల మధ్య చాలా వాగ్వాదాలు చోటు చేసుకుంటాయంటున్నారు పండితులు. అలాగే ఈ సంవత్సరం దేశంలో, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రయాలు కలుగుతాయంట. క్రోధములు కలగడం, దేశాల మధ్య భిన్నాభిప్రయాల వలన యుద్ధ వాతావరణం, కోపావేశాలు కలుగుతాయంట అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.అనారోగ్య సమస్యలు కూడా అధికం అవుతాయని చెబుతున్నారు.