ట్విట్టర్‌లో పాడ్‌కాస్ట్ సేవలు..Twitter officially adds podcasts

దిశ, ఫీచర్స్ : స్పోటిఫై, క్లబ్‌హౌజ్ వంటి పాడ్‌కాస్ట్స్‌కు ఆదరణ లభిస్తున్న తరుణంలో ట్విట్టర్ స్పేసెస్(Spaces) ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై వాయిస్ ఆధారిత కంటెంట్ సహా ఆడియో సంభాషణలు పెరిగిపోయాయి..Latest Telugu News

Update: 2022-08-27 09:08 GMT

దిశ, ఫీచర్స్ : స్పోటిఫై, క్లబ్‌హౌజ్ వంటి పాడ్‌కాస్ట్స్‌కు ఆదరణ లభిస్తున్న తరుణంలో ట్విట్టర్ స్పేసెస్(Spaces) ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై వాయిస్ ఆధారిత కంటెంట్ సహా ఆడియో సంభాషణలు పెరిగిపోయాయి. దీంతో 'ఇంటారాక్షన్స్' రికార్డింగ్‌తో పాటు పాడ్‌కాస్ట్స్ పోస్ట్ చేసేందుకు యూజర్లకు అవకాశం కల్పిస్తోంది 'స్పేసెస్'. రీడిజైన్‌లో ఈ ఫీచర్స్‌ను ఏకీకృతం చేసిన ట్విట్టర్.. ఇంటిగ్రేషన్ ఆడియో అనేది క్రియేటర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగమని పేర్కొంది.

ట్విట్టర్.. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా పాడ్‌కాస్ట్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం దాని ఆడియో చాట్ రూమ్(స్పేసెస్) టెస్ట్ వెర్షన్‌కు పాడ్‌కాస్ట్స్ జోడిస్తోంది. రీడిజైన్ చేసిన Spaces ట్యాబ్‌లో న్యూస్, మ్యూజిక్, స్పోర్ట్స్ సహా మరిన్ని పర్టిక్యులర్ థీమ్స్ ద్వారా ఆడియో కంటెంట్‌ వినవచ్చు. అంతేకాదు వినియోగదారుల కోసం 'స్టేషన్స్' పేరుతో వ్యక్తిగతీకరించిన హబ్‌లను ట్విట్టర్ పరిచయం చేస్తోంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుంచి జనాదరణ పొందిన, ఆకర్షణీయమైన పాడ్‌కాస్ట్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆటోమేటిక్‌గా పాడ్‌కాస్ట్స్‌ను యూజర్లకు సూచించడం ద్వారా వారు మరింతగా తెలుసుకోవాలనుకునే అంశాలను కనుగొనేందుకు, వినేందుకు వీలు కల్పిస్తోంది. ఉదా : ట్విట్టర్‌లో ఎవరైనా వోక్స్ కంటెంట్‌తో రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అయితే, వారు బహుశా Spaces హబ్‌లో Vox పాడ్‌కాస్ట్‌ను చూడవచ్చు.

Tags:    

Similar News