Turmeric Water: ముఖ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
పసుపు వాటర్‌తో ఫేస్ కడిగితే బోలెడన్నీ లాభాలు ఉన్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: పసుపు వాటర్‌తో ఫేస్ కడిగితే బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖానికి ఎంతో మేలు చస్తాయి. రాత్రి పడుకునే ముందు పసుపు వాటర్ తో ముఖం కడిగితే మచ్చలు, పింపుల్స్ , ముడతలకు చెక్ పెట్టొచ్చు. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా మెల్లి మెల్లిగా తగ్గిపోతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. కానీ ముఖానికి పసుపు నీటిని అప్లై చేసే ముందు తప్పకుండా నార్మల్ వాటర్ తో ఫేస్ కడగాలి. ఇలా చేస్తే స్కిన్ దురద, మంట లాంటివి రాకుండా ఉంటాయి.
ఇక పసుపు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిందే. పసుపు జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయి. గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తాపజనక ప్రేగు వ్యాధికి ప్రత్యేకంగా పసుపు మేలు చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో లేదా పాలల్లో కాస్త పసుపు కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. కాగా మీరు కూడా ఓ వారం రోజుల పాలు పసుపు వాటర్ తో ఫేస్ కడగడంతో పాటు పాలల్లో, వాటర్ లో పసుపు వేసి తాగండి. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.