వర్షాకాలంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే వీటిని ట్రై చేయండి!
వర్షాకాలంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరుగుతుంది.
దిశ, ఫీచర్స్: వర్షాకాలంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరుగుతుంది. ఇది చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. రుతుపవనాలు వేడి ఎండ నుండి ఉపశమనం కలిగిస్తాయి. కానీ, ఈ చల్లని వాతావరణం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ల అభివృద్ధి చెందుతుంది. చర్మాన్ని శుభ్రంగా పొడిగా ఉంచండి. ఫ్రెష్ అయినా తర్వాత చర్మం పొడిబారుతుంది. మీ కాలి వేళ్ళు నడుము ప్రాంతాన్ని పొడిగా ఉంచాలని చర్మవ్యాధి నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీరు వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడు తున్నట్లయితే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. మీరు ఏ సమయంలో స్నానం చేసినా మంచిగా స్నానం చేయండి. అలా చేసిన తర్వాత తర్వాత యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకోవాలి. ఇది శిలీంధ్రాల పెరుగుదలను ఆపుతుంది
2. ఈ వాతావరణంలో తడి బట్టలు అసలు వేసుకోవద్దు. ఎక్కువ సేపు శరీరం మీద తడి బట్టలు ఉండకూడదు. వర్షం వల్ల బట్టలు తడిసిపోతే వెంటనే మార్చుకోవాలి. లేకపోతే, మీ అనారోగ్య సమస్యలు వస్తాయి.
3. ఈ సీజన్‌లో కాటన్ దుస్తులు ధరించాలి. అలాంటి దుస్తులు ధరించడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది. ఈ సీజన్‌లో బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా ఉండండి. ఇది శిలీంధ్రాలను పెరగకుండా చేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.