Trending : ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన వస్తువు ఇదే.. స్పెషాలిటీ ఏంటంటే..
ప్రపంచంలో అందమైన ప్రదేశమేది? అత్యంత విలాసవంతమైన వస్తువేది? అనే సందేహాలు మీకెప్పుడైనా కలిగాయా? ఎందుకంటే ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం సహజంగానే చాలా మందిలో కనిపిస్తుందని నిపుణులు చెప్తుంటారు.
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో అందమైన ప్రదేశమేది? అత్యంత విలాసవంతమైన వస్తువేది? అనే సందేహాలు మీకెప్పుడైనా కలిగాయా? ఎందుకంటే ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం సహజంగానే చాలా మందిలో కనిపిస్తుందని నిపుణులు చెప్తుంటారు. ప్రజెంట్ అలాంటి న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏంటంటే.. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం కూడా వరల్డ్‌లోనే మోస్ట్ లగ్జరీ వస్తువు పడవ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు నిపుణులు.
అత్యంత విలాసవంతమైన లగ్జరీ వస్తువుగా చాలా మంది వ్యాపారస్తులు, టూరిస్టులు పడవను భావిస్తున్నారని పేర్కొన్న ఫోర్బ్స్ మ్యాగజైన్, దానికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలను కూడా వెల్లడించింది. ఇందులో నివసించడానికి చాలా సౌకర్యాలు ఉండటం, సముద్రంపై విహరించడం చాలా మందికి ఆనందాన్ని ఇస్తుందట. ఇక లగ్జరీ పడవల్లోనూ అనేక రకాలు ఉంటాయి. కాగా ప్రపంచంలోకెల్లా అన్నింటికంటే విలాసవంతమైన పడవగా ఇప్పుడు మలేషియాకు చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ‘లగ్జరీ యాచ్’ అనే పడవ ప్రసిద్ధి చెందింది. 2011లో దీనిని నిర్మించారు. ‘హిస్టరీ సుప్రీం’అని కూడా పిలుస్తారు. గోల్డ్ అండ్ ప్లాటినంతో తయారు చేసిన ఈ షిప్ ధర రూ. 38 వేలకోట్లపైనే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.