ట్రెండ్‌ అవుతున్న ఆరెంజ్ టీ.. ఎలా తయారు చేసుకోవాలంటే..?

ఆరెంజ్ టీని ఎక్కువగా తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-02-17 05:00 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, యాపిల్ టీ, రోజ్ టీ, పుదీనా టీ, కొత్తిమీర టీ ఇలా మొదలైనవి చాలా రకాలు ఉన్నాయి. మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా మనందరికి తెలిసిందే. అయితే, తాజాగా ఇప్పుడు కొత్త రకం టీ బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటో అని ఆలోచిస్తున్నారా.. అదే ఆరెంజ్ టీ. ఈ ఆరెంజ్ టీ యొక్క ప్రత్యేకత, దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆరెంజ్ టీని ఎక్కువగా తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.కాబట్టి ఈ సమయంలో తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. అయితే ఈ టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

ఆరెంజ్ టీ కి కావాల్సిన పదార్థాలు

ఒక ఆరెంజ్

ఒక కప్పు నీరు

ఒక టీస్పూన్ టీ పొడి

ఒక స్పూన్లు చక్కెర

ఆరెంజ్‌ టీ ని ఎలా తయారు చేసుకోవాలంటే?

ముందుగా ఒక ఆరెంజ్‌ తీసుకుని దాని తొక్క నుంచి తొనలను పక్కకి పెట్టండి. ఇక్కడ మనకి తొక్క మాత్రమే కావాలి, తొనలు అవసరం లేదు. ఆ తర్వాత, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని దానిలో ఆరెంజ్ తొక్కలు, పంచదార వేసి బాగా మరిగించాలి. కొంత సేపటి తర్వాత, ఆరెంజ్ తొక్కను తీసుకొని టీని వడపోయండి. ఇప్పుడు కొద్దిగా పంచదార వేసి మళ్లీ నీటితో మరిగించండి. అంతే ఆరెంజ్ టీ రెడీ. 


Similar News