Tomato: ఈ చిట్కాలతో టమాటాలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు

అలాంటి సమయంలో మనం వెజిటేబుల్స్ ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలి.

Update: 2024-07-22 06:45 GMT

దిశ, ఫీచర్స్: వర్షాకాలం మొదలవ్వగానే కూరగాయలు మన చేతికి కూడా అందకుండా పోతాయి. అలాంటి సమయంలో మనం వెజిటేబుల్స్ ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలి. లేదంటే కుళ్ళిపోయే అవకాశం ఉంది. వర్షాకాలంలో టమాటాలు 24 గంటలు కూడా ఆగవు.. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఈ చిట్కాలతో టమాటాలను ఫ్రెష్ గా ఉంచవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..

పసుపు వాటర్

ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు, పసుపు వేసి నీటిలో టమోటాలు వేసి కొంచం సేపు అలాగే ఉంచాలి. 10 నిముషాలు తర్వాత టమోటాలను తుడిచి ఒక మూతలేని పాత్రలో టమాటోలను పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన టమాటాలు ఆరు రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

మట్టి

మట్టిలో టమోటాలను నిల్వ చేయవచ్చని చాలా మందికి తెలీదు. దీని కోసం ముందుగా ఒక బుట్టను తీసుకుని దానిలో మొత్తం మట్టిని వేసి ఇప్పుడు టమోటాలను వాటిపై పేర్చి పైన కొంచం మట్టిని కప్పండి. ఇలా చేస్తే ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

న్యూస్ పేపర్

టమోటాల లోడ్ ను దించేటప్పుడు బాక్స్ ల మీద న్యూస్ పేపర్స్ ఉండటం మీరు గమనించే ఉంటారు. ఎక్కువ సమయం నిల్వ ఉంచడానికి దీన్ని పాటిస్తారు. కాబట్టి మీరు కూడా ఒక బాక్స్ లో పేపర్ వేసి టమాటాలు వేసి తర్వాత మళ్లీ వాటిపై టొమాటో పొరను వేయండి. ఇలా చేస్తే వర్షాకాలంలో చెడిపోకుండా ఉంటాయి.

Tags:    

Similar News