Liver: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!

లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ అనారోగ్య సమస్యలు రావు

Update: 2024-11-02 16:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. లివర్ దానికంటే ముఖ్యమైనది. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ అనారోగ్య సమస్యలు రావు. మనం తీసుకునే ఆహారం మీద లివర్ ఆధారపడి ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉంచేందుకు తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..

నువ్వుల్లో ప్రోటీన్లు, విటమన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది లివర్ ను డీటాక్స్ చేసేందుకు మంచిగా పనిచేస్తుంది.

పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ లివర్‌ను మెరుగుపరుస్తాయి. లివర్‌లో ఏవైనా పోషకాల లోపం ఉంటే దీని ద్వారా తగ్గించుకోవచ్చు.

వెల్లుల్లి ఆయుర్వేద పరంగా మంచి ఔషధమని చెబుతుంటారు. దీనిలో ఉండే ఎలిసిన్ అనే రసాయనం లివర్‌ను శుభ్రపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags:    

Similar News