డెస్క్ టాప్‌లో మీ వాట్సాప్ సరిగా పని చేయడం లేదా.. ఈ టిప్స్ మీకోసమే?

వాట్సాప్ వెబ్ వాడకం చాలా పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఎక్కువగా వాట్సాప్ వెబ్‌నే వాడుతుంటారు. ఇక వారు ఆఫీసుకు వెళ్లి డ్యూటీ చేసుకొనే సమయంలో,వాట్సాప్ వెబ్‌లో చాలా సమస్యలు తలెత్తుతుంటాయి.

Update: 2023-04-27 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వాట్సాప్ వెబ్ వాడకం చాలా పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఎక్కువగా వాట్సాప్ వెబ్‌నే వాడుతుంటారు. ఇక వారు ఆఫీసుకు వెళ్లి డ్యూటీ చేసుకొనే సమయంలో,వాట్సాప్ వెబ్‌లో చాలా సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మనం వాట్సాప్ వెబ్ వాడటానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం.

ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆ సమస్యలను తొలిగించే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. క్యూఆర్ కోడ్ అనేది వాట్సప్ అందించే ఇన్ బిల్డ్ క్యూఆర్ కోడ్ ద్వారానే పనిచేస్తుంది.కొందరు ర్యాండమ్ క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తారు వాటి వల్ల సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి వేరే యాప్ ల స్కానర్లు వాడకూడదు.

2. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోవాలి.

3.ఎప్పటికప్పుడు బ్రౌజర్ లో ఉండే క్యాచీ ఫైల్స్ డిలీట్ చేస్తూ ఉండాలి.ఎందుకంటే,బ్రౌజర్ లోని క్యాచీ ఫైల్స్ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ కు ఆటంకం కలిగిస్తాయి.

4.క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేముందు స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉండాలి.దుమ్ము, ధూళి లాంటివి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News