Flying Ants : వర్షాకాలంలో ఎగిరే చీమలు విసిగిస్తున్నాయా.. వాటిని ఇలా వదిలించుకోండి..

వర్షాకాలంలో మనిషిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. వర్షంలో తేమ కారణంగా క్రిములు బయటకు వస్తాయి.

Update: 2024-08-16 15:31 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో మనిషిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. వర్షంలో తేమ కారణంగా క్రిములు బయటకు వస్తాయి. ఈ కీటకాలలో కొన్ని ఇళ్లలోనే తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎరుపు - నలుపు ఎగిరే చీమలు ఈ కీటకాలలో ఒకటి. గుంపులుగా పరిగెడుతున్న చీమలు కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ ఒక్కటేమిటి ప్రతిమూలకు చేరుకుంటాయి. వంట గదిలోకి వెళ్లగానే ఆహార పదార్థాలను పాడుచేస్తాయి.

అంతేకాదు కొన్నిసార్లు ఈ ఎగిరే చీమల భయం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో కొన్నిచీమలు తెగ కుట్టేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఇంటి నుండి పారదోలేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని చిట్కాలను చూసేద్దాం.

పుల్లని వస్తువులు..

ఎగిరే చీమలు పుల్లని వస్తువుల వాసనను ఇష్టపడవు. అందుకు నిమ్మ, నారింజను ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక మగ్ నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా ఆరెంజ్ రసాన్ని కలిపి ద్రావణాన్ని తయారు చేయండి. ఇప్పుడు చీమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో ఈ ద్రవాన్ని పిచికారీ చేయండి. ఆ తరువాత చీమలు అస్సలు కనిపించవు.

వెల్లుల్లి, దాల్చిన చెక్క..

వెల్లుల్లి పేస్ట్ లేదా దాల్చిన చెక్క పొడితో మీ ఇంటి నుండి ఎగిరే చీమలను తరిమికొట్టవచ్చు. వెల్లుల్లి ఘాటు వాసనను కీటకాలు అస్సలు ఇష్టపడవు. అందుకే వర్షాకాలంలో ఈ ఇబ్బందికరమైన చీమలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి ఇది ఉత్తమ పరిష్కారం.

ఇంట్లో ఈ మొక్కలు నాటండి..

సహజమైన పద్ధతిలో ఎగిరే చీమలను తరిమికొట్టాలనుకుంటే, కొన్ని మొక్కలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తులసి, లెమన్ గ్రాస్, పుదీనా కాకుండా ఇలాంటి ఎన్నో మొక్కలను మీ ఇంటి బాల్కనీలో నాటవచ్చు. వీటి ద్వారా ఎగిరే చీమల బెడద పోతుంది.

బోరిక్ పౌడర్, వెనిగర్..

బోరిక్ పౌడర్, వెనిగర్ కూడా ఎగిరే చీమలను చంపడానికి, వాటిని ఇంటి నుండి తరిమికొట్టడానికి ఉపయోగించవచ్చు. చీమలు వాటి వాసనను అస్సలు తట్టుకోలేవు. మీరు ఈ వస్తువులను పేస్ట్ చేసి, చీమలు వచ్చిన చోట స్ప్రే చేయాలి. దీని తరువాత చీమలు వెంటనే ఇంటిని విడిచిపెట్టడం ప్రారంభిస్తాయి.

పరిశుభ్రత పై శ్రద్ధ వహించండి..

సమయానికి ఇంటిని శుభ్రం చేసినప్పుడు మాత్రమే ఏదైనా నివారణ ప్రభావవంతంగా ఉంటుంది. క్లీనింగ్‌తో పాటు, చీమలను ఆకర్షించే ఆహార పదార్థాల పైన మూతపెట్టాలి. ఈ చర్యలతో పాటు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ద్వారా, మీరు చీమలను నివారించవచ్చు.

Tags:    

Similar News