బీరువాలో పాత చీరలు కుప్పలుగా ఉన్నాయా.. ఇలా రీ యూస్ చేయండి..
చీర భారతీయ సంస్కృతి నిలువటద్దం. ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమరకు అవసరాన్ని బట్టి చీరలు కట్టే విధానంలో మార్పులు వస్తుంటాయి.
దిశ, ఫీచర్స్ : చీర భారతీయ సంస్కృతి నిలువటద్దం. ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమరకు అవసరాన్ని బట్టి చీరలు కట్టే విధానంలో మార్పులు వస్తుంటాయి. ప్రస్తుత కాలంలో అనేక రకాల చీరలు అందుబాటులోకి వచ్చాయి. చాలామంది చీరలను ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి నిల్వ ఉంచుతారు. దీని వల్ల చీరలు అకాలంగా పాడైపోతున్నాయి. అందులో మీకు ఎంతగానో నచ్చిన చీరలు కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టం అవుతుంది. అలాంటి కొన్ని పాడైపోయిన చీరలను మళ్లీ రీ యూజ్ చేసేందుకు కొన్ని టిప్స్ ని ఇప్పుడు చూద్దాం.
కండువా..
ఇంట్లో బీరువాలో పెట్టుకున్న చీరలు పాతబడిపోతే పారేసుకోవాల్సిన పనిలేదు. వీటిని కట్ చేసి స్కార్ఫ్ లా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి దుపట్టాలు బయటికి వెళ్లినప్పుడు మీ లుక్ ని మారుస్తాయి.
బ్యాగ్ డిజైన్..
నిల్వ చేయడం వల్ల పాడైపోతున్న చీరలతో పొట్లీ బ్యాగులను తయారు చేసుకోవచ్చు. పాత చీరల నుండి పొట్లీ బ్యాగులను తయారు చేయడం చాలా సులువు. దీన్ని సరిగ్గా కుట్టడం ముఖ్యం. చీరలతో బ్యాగ్ ను కుట్టి వాటిని అలంకరిస్తే సుందరంగా కనిపిస్తాయి.
కర్టన్లు..
చీర పొడవు 6 మీటర్లు ఉంటుంది. అలాంటి చీరలను మీరు ఇంటి గమ్మాలకి కర్టెన్లు చేయడానికి ఉపయోగించవచ్చు. చీరతో తయారు చేసిన రంగురంగుల కర్టెన్లు మీ గది అందాన్ని మరింత పెంచుతాయి. కర్టెన్లను తయారు చేయడానికి వివిధ రకాల చీరలను కలిపి కుట్టవచ్చు.
కుషన్ కవర్లు..
భారతీయ చీరల పై ఉండే అందమైన డిజైన్ లు, ప్రింట్లు కుషన్‌లకు సరిగ్గా సరిపోతాయి. పాత చీరల నుండి కుట్టిన కుషన్ కవర్లు చాలా ట్రెండీ లుక్ ఇస్తాయి. కుషన్‌కు స్టైలిష్ లుక్ ఇవ్వడానికి లేస్ లేదా పాంపమ్స్ ఉపయోగించవచ్చు. పండుగ సీజన్‌లో మీ ఇంటిని అలంకరించుకోవడానికి పాత చీరల నుండి సోఫా సీట్ కవర్‌లను కూడా కుట్టుకోవచ్చు.