అండర్‌వేర్ ధరించకపోతే ఎన్ని ప్రయోజనాలో..
ఈ కాలంలో అండర్‌వేర్స్ ధరించకుండా ఉండటం అనేది కష్టం. కానీ ఒకవేళ ధరించకపోతే ఏం జరుగుతుంది? ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
దిశ, ఫీచర్స్ : ఈ కాలంలో అండర్‌వేర్స్ ధరించకుండా ఉండటం అనేది కష్టం. కానీ ఒకవేళ ధరించకపోతే ఏం జరుగుతుంది? ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే.. అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో ఒకటి లెస్ నర్వ్ పెయిన్. అంటే నరాల నొప్పిని నివారించవచ్చన్నమాట. చాలా వరకు అండర్‌వేర్స్ స్ట్రాంగ్ నడుము పట్టీలను కలిగి ఉండి నడుముపై, అలాగే బొడ్డుపై ప్రెషర్‌ను పెంచుతాయి. ప్రత్యేకంగా తుంటి లేదా తొడ వెనుక భాగంలోని వీన్స్‌పై ప్రెషర్ పడటంవల్ల నొప్పికి దారితీస్తుంది. కాబట్టి ధరించకపోతే ఈ నొప్పిలో తగ్గుదల ఉంటుంది. ఎందుకంటే.. లోదుస్తులపై ఉండే ఎలాస్టిక్ బ్యాండ్‌లు నిజానికి నరాల చుట్టూ ఉన్న కండరాలను కుదిస్తాయి. దిగువ వీపు నుంచి కాళ్ల కింది వరకు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇన్నర్స్ యూజ్ చేయకపోవడం వల్ల ఆ ప్రాంతంలో స్థిరమైన ఒత్తిడి, నొప్పిని నివారించడానికి సహాయపడుతుంది.
మెరుగుపడుతున్న బ్లడ్ సర్క్యులేషన్
గరుకైన, బిగుతైన అండర్‌వేర్స్ అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవి మొత్తం బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తొడ యొక్క తిమ్మిరి, జలదరింపుకు కారణమయ్యే.. మెరల్జియా పరేస్తేటికా అనే పరిస్థితికి కూడా దారి తీస్తుంది. మీ స్కిన్ ఫాబ్రిక్‌కు మాత్రమే కాకుండా అండర్‌వేర్‌లోని కెమికల్స్, కలర్స్‌వల్ల ప్రభావితం కావచ్చు. అంతేగాక లోదుస్తులు స్థిరంగా అతుక్కోవడంవల్ల ఇరిటేషన్ కలుగుతుంది. కాబట్టి ధరించకపోవడంవల్ల ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు. కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇబ్బందులను నివారించవచ్చు. లోదుస్తులు లేకుండా పడుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రైవేట్ పార్ట్స్‌పై ఒత్తిడి ఉండదు. దీంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
ఇన్ఫెక్షన్స్ దూరం
ముఖ్యంగా మహిళల్లో యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అండర్ వియర్స్ కూడా కారణం అవుతుంటాయి. కొన్ని రకాల దుస్తులు తేమను పీల్చే గుణం లేకపోవడం కూడా ఇందుకు దోహదం చేస్తుంది. కాటన్ దుస్తులు ధరించడం, లో దుస్తులు ధరించకపోవడం ఇటువంటి పరిస్థితిని నివారిస్తాయి. అలాగే కొన్ని రకాల బిగుతైన లోదుస్తులు అన్నవాహికకు కడుపులో యాసిడ్‌ని పుష్ చేయవచ్చు. దీనివల్ల గుండెల్లో మంట(రిఫ్లక్స్) వస్తుంది. ధరించకపోవడంవల్ల ఈ విధమైన పరిస్థితికి చెక్ పెట్టవచ్చు.
కొన్ని లోదుస్తులు తేమను ఎలా ట్రాప్ చేస్తాయో, బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తిని ఎలా సృష్టిస్తాయో మనకు తెలుసు. ఇన్నర్స్ ధరించడం వల్ల అధిక తేమతో కాండిడా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది
టైట్‌గా ఉండే అండర్‌వేర్స్ పురుషులలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే స్పెర్మ్ ఉత్పత్తిని ఆప్టిమైజ్ చేయడానికి వృషణాలు నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. బిగుతైన దుస్తులవల్ల ఇటువంటి పరిస్థితి ఉండదు. వృషణాలు శరీరానికి వ్యతిరేకంగా బిగుతైన అండర్‌వేర్ వల్ల నొక్కబడినప్పుడు వాటి టెంపరేచర్ పెరుగుతుంది. ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యకు దారితీస్తుంది. ధరించకపోవడం వల్ల దీనిని నివారించవచ్చు.
డిశ్చార్జ్ ప్రాబ్లమ్ అధిగమించవచ్చు
డిశ్చార్జ్.. బ్యాక్టీరియా, శ్లేష్మం(mucus), ఇతర ద్రవాల కలయికతో కూడిన స్కిన్ సెల్స్ అని చెప్పవచ్చు. కాగా కొన్ని లోదుస్తులు డిశ్చార్జ్‌ను ఇంక్రీజ్ చేస్తాయి. జననేంద్రియాల ప్రాంతంలో ఎక్కువ వెంటిలేషన్ తక్కువగా డిశ్చార్జ్‌కు దారితీయవచ్చు. కాగా కేవలం లోదుస్తులను ఉతికితే, వాష్ వాటర్‌లో సుమారు 100 మిలియన్ ఇ.కోలి బ్యాక్టీరియా ఉంటుంది. అవి తదుపరి లోడ్ లాండ్రీకి ట్రాన్స్‌మిట్ అవుతుందని చెప్తున్న నిపుణులు.. అండర్‌వేర్ వేసుకునే అలవాటును మానుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియాకు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. థాంగ్స్ ధరించే వారికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. బిగుతైన దుస్తుల్లో ఇ. కోలి అనే బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా పెద్దప్రేగులో కనిపించే బ్యాక్టీరియా. కానీ కదలికతో ఇది పురుషనాళం నుంచి మూత్ర నాళానికి ఫాబ్రిక్ ద్వారా ప్రయాణించవచ్చు.
బట్ పింపుల్స్ తగ్గుదల
ఫోలిక్యులిటిస్, అలాగే బట్ పింపుల్స్ కొందరికి బాధను కలిగిస్తాయి. ఇవి నిజానికి లోదుస్తుల రాపిడి, చెమట వల్ల సంభవించే ఎర్రబడిన హెయిర్ ఫోలికల్స్ అని చెప్పవచ్చు. వదులుగా ఉన్న దుస్తులు ధరించడం, బిగుతైన లోదుస్తులను ధరించకపోవడంవల్ల ఈ సమస్య దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అండర్‌వేర్స్ రాపిడివల్ల తరచూ యూరిన్ చేయాలనిపిస్తుంది. ధరించకపోవడం వల్ల ఈ పరిస్థితి తగ్గుతుంది. అంతేగాక సౌకర్యంగా ఉండటం, ఒత్తిడి కలుగకపోవడం, వివిధ స్కిన్ ప్రాబ్లమ్స్ వంటివి రాకపోవడం జరుగుతాయి. దీని వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
Also Read..