Soda with Alcohol: సోడాతో ఆల్కహాల్ తాగేవారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి

ఆల్కహాల్ శరీరానికి మంచిది కాదని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

Update: 2024-08-08 13:52 GMT

 దిశ, ఫీచర్స్ : ఆల్కహాల్ శరీరానికి మంచిది కాదని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. అయినా కూడా దీన్ని వినియోగించే వారి సంఖ్య పెరుగుతుంది తప్ప అసలు తగ్గడం లేదు. కొందరు సోడాతో ఆల్కహాల్ తాగుతుంటారు కానీ, ఇది మంచిదో? కాదో కూడా తెలుసుకోరు. సోడాతో ఆల్కహాల్ తాగితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది మద్యం సేవించేటప్పుడు వాటర్ కంటే సోడానే ఎక్కువ తీసుకుంటారు. అయితే, ఇది అంత మంచి పద్దతి కాదని నిపుణుల చెబుతున్నారు. సోడాతో మందు తాగేవారు వెంటనే తూలి పడిపోతున్నారని అధ్యయనాలు తెలిపాయి. ఎందుకంటే వీటిలో ఫాస్పోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, కార్బోనేటేడ్ వాటర్, కెఫిన్ వంటి పదార్ధాలు కలుస్తాయి. ఇది అధికంగా తీసుకోవడం వలన మధుమేహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం వచ్చింది.

మద్యం సేవించేటప్పుడు సోడా కంటే మంచి నీరు కలపడం చాలా మంచిది. దీనిలో గోరువెచ్చ నీరైతే ఎలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే ఈ వాటర్ పోయడం వల్ల ఆల్కహాల్ లెవెల్ తగ్గిపోతుంది. ఫలితంగా దాని తీవ్రత కూడా తగ్గిపోతుంది. అలాగే హ్యాంగోవర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News