బాగా సన్నగా ఉండే వారు.. ఈ కూరగాయను మీ డైట్ లో చేర్చుకోండి!

ప్రస్తుతం, చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు.

Update: 2024-06-16 06:16 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం, చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, కొంతమంది సన్నగా ఉండటం వల్ల కూడా చాలా మంది బాధ పడుతుంటారు. కొందరు ప్రొటీన్ సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపగా, మరికొందరు షేక్స్, స్మూతీస్ లేదా హై ప్రొటీన్ డైట్ తీసుకోవడం మొదలు పెడతారు. బరువు పెరగడానికి ఏ కూరగాయలు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

మార్కెట్లో బంగాళదుంపలు చౌకగా దొరుకుతాయి. బంగాళదుంపలతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. బంగాళదుంప కూర, పరోటాలు, పకోడీలు, ఇంట్లో తయారు చేస్తారు. మీరు బంగాళాదుంపలను తింటే, మీ శరీరానికి తగినంత పొటాషియం, కార్బోహైడ్రేట్లు అందుతాయి. మీరు సన్నగా ఉంటే, మీ రోజువారీ ఆహారంలో ఉడికించిన బంగాళదుంపలను తప్పకుండా చేర్చుకోండి.

బరువు పెరగడానికి బంగాళదుంపలు ఎలా తినాలి?

ఉడికించిన బంగాళాదుంపలు బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. వేసవిలో, కాటేజ్ చీజ్ బంగాళాదుంపలతో కూడా తినవచ్చు. కావాలంటే రెండూ కలిపి తినవచ్చు. బంగాళదుంపలు, కాటేజ్ చీజ్ తినడం కడుపులో వేడిని తగ్గిస్తుంది.బరువు కూడా త్వరగా పెరుగుతారు. రెండు నుంచి మూడు ఉడికించిన గుడ్లును మెత్తగా చేసుకుని, ఆ తర్వాత దానిలో పెరుగు, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర జోడించండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే నెల రోజుల్లోనే తేడా తెలుస్తుంది.


Similar News