Raksha Bandhan : ఈ సారి రెండు రోజులు రాఖీ పండుగ.. ఏ రోజు రాఖీ కట్టడం మంచిదంటే?

రాఖీ పండుగ అంటే చాలా మందికి ఇష్టం. ఈరోజు కోసం సోదరీమణులు ఎదురు చూస్తుంటారు. ఇక రాఖీ ఫెస్టివల్ రోజు అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టీ, వారు సంతోషంగా ఉండాలని దీవిస్తారు. ఇక తన చెల్లి లేదా అక్కకు సోదరులు కట్నం లేదా మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు.

Update: 2023-08-07 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాఖీ పండుగ అంటే చాలా మందికి ఇష్టం. ఈరోజు కోసం సోదరీమణులు ఎదురు చూస్తుంటారు. ఇక రాఖీ ఫెస్టివల్ రోజు అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టీ, వారు సంతోషంగా ఉండాలని దీవిస్తారు. ఇక తన చెల్లి లేదా అక్కకు సోదరులు కట్నం లేదా మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు.

అయితే ఈ సారి రాఖీ పండుగ రెండు రోజులు వస్తుంది. ఎప్పుడు ఈ ఫెస్టివల్ విషయంలో చిన్న సందేహం ఉంటుంది. మంచి సమయంలో రాఖీ కట్టాలి, భద్రనీడలో కట్ట కూడాదు అంటారు.కాగా, ఈ సారి పండగ రోజున భద్ర నీడ ఉండడంతో..పండుగ తేదీపై ప్రజల్లో గందరగోళం నెలకొంది.

అయితే పండితులు పండుగ గురించి ఏం చెబుతున్నారంటే? హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 30న జరుపుకోనున్నారు. కానీ పండుగ రోజు భద్ర నీడ ఉంది. ఆగస్టు 30న ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉంది. ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదని పండితులు అంటున్నారు.

భద్ర కాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం మంచిదంట. ఒకవేళ ఆగస్టు 30న రాఖీ కట్టాలని అనుకుంటే రాత్రి 9.15 గంటల తర్వాత శుభ ముహూర్తం మొదలవుతుంది. ఆగస్టు 31న ఉదయం 7.5 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టే శుభ సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో పండుగ జరుపుకోవచ్చు. అందుకే ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోనున్నారు. 

Read More:   2025లో అంతరిక్షయానం.. అక్కడ మరణం సంభవిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Tags:    

Similar News