గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఇదే సరైన ఆహారం!
కాలీఫ్లవర్ అనేది కొలన్(విటమిన్-బీ కాంప్లెక్స్ సముదాయంలోని ఒక పదార్థము)కు గొప్ప వనరు.
దిశ, వెబ్‌డెస్క్: కాలీఫ్లవర్ అనేది కొలన్(విటమిన్-బీ కాంప్లెక్స్ సముదాయంలోని ఒక పదార్థము)కు గొప్ప వనరు. ఇది మానసిక స్థితికి, జ్ఞాపకశక్తికి, కేంద్ర నాడీ వ్యవస్థకు సందేశాన్ని అందించే ఎసిటైల్కోలిన్‌కు, మెదడు అభివృద్ధికి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అంతేగాక, సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కామన్‌గా కూరగాయల్లో విటమిన్ కే, కోలిన్, ఇనుము, కాల్షియంతో పాటుగా ఎన్నో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ.. కాలీఫ్లవర్‌లో వాటితో పాటు మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒక కప్పు కాలీఫ్లవర్‌లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది.
ఈ ఫైబర్ జీర్ణక్రియ పనితీరుకు, బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందని ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీలో ప్రచురించిన అధ్యయనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో సల్ఫోరాఫేన్ అనే మొక్కల సమ్మేళనం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతూ... ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. కాలీఫ్లవర్‌లో ఇండోల్ -3-కార్బినాల్ (ఐ 3 సీ) అనే మొక్కల సమ్మేళనం ఉంటుంది.
ఇది మొక్కల ఈస్ట్రోజెన్‌గా పనిచేస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించడమే కాకుండా హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ సీ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌గా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రోగాల ప్రమాదాలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read...
ఉదయాన్నే నానబెట్టిన వేరు శెనగలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?