జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచే బెస్ట్ ఫుడ్‌ ఇదే!

బ్లూ బెర్రీస్.. ఈ పండ్లు మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది.

Update: 2023-08-11 13:33 GMT

దిశ,వెబ్ డెస్క్: బ్లూ బెర్రీస్.. ఈ పండ్లు మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి మ‌న దేశంలో తాజాగా చాలా త‌క్కువ ప్రాంతాల్లో మాత్ర‌మే దొరుకుతాయి. ఇత‌ర దేశాల్లో వీటిని ఎక్కువ‌గా ఆహారంలో భాగంగా చేసుకొని తింటారు. వీటిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు వెల్లడించారు. వీటిని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి.

100 గ్రాముల డ్రై బ్లూబెర్రీస్ లో 15 గ్రాముల నీటి శాతం, 319 కిలో క్యాలరీల శ‌క్తి, 67.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్, 2.4 గ్రాముల కొవ్వులు, 7.5 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. బ్లూ బెర్రీస్ ను రోజు తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్  బాధ‌ప‌డే వారికి ఈ పండ్లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో బ్లూబెర్రీలు మంచిగా ప‌ని చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని  ఆహారంగా తీసుకుంటే జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

Read More:    పెరుగులో ఇది క‌లిపి రాస్తే చాలు.. ముఖం అందంగా మారుతుంది!

Tags:    

Similar News