పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోయిన వారికి శుభవార్త.. ఈ పరికరం బాడీకి కనెక్ట్ చేస్తే అంతా సెట్..

పక్షవాతంతో చేతులు, కాళ్లు పడిపోయినవారిలో మళ్లీ కదలికలను తీసుకురావడానికి శరీరంలో ప్రత్యేక పరికరాలను అమర్చడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఉపయోగించి వెన్నుపాము గాయపడిన

Update: 2024-05-28 12:36 GMT

దిశ, ఫీచర్స్: పక్షవాతంతో చేతులు, కాళ్లు పడిపోయినవారిలో మళ్లీ కదలికలను తీసుకురావడానికి శరీరంలో ప్రత్యేక పరికరాలను అమర్చడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఉపయోగించి వెన్నుపాము గాయపడిన రోగులకు సహాయం చేస్తారు. వారిని నార్మల్ గా మార్చేందుకు ట్రై చేస్తారు. అయితే తాజాగా బాడీలో డివైజ్ అమర్చే అవసరం లేకుండానే పెరాలసిస్ పెషేంట్లకు హెల్ప్ చేస్తున్నారు పరిశోధకులు. వారిలో మళ్ళీ కదలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

EPFL, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు కనుగొన్న ARC-EX పరికరాన్ని ఈ పని చేసి చూపిస్తుంది. US, స్కాట్లాండ్ కు చెందిన రోగులపై జరిగిన ట్రయల్ ఆల్రెడీ సక్సెస్ కాగా ఇది ఎలా వర్క్ చేస్తుందో వివరించారు పరిశోధకులు. వెన్నుపాముకు దగ్గర మెడపై ఎలక్ట్రోడ్లను అమర్చి.. ఈ పరికరం ద్వారా విద్యుత్ ను శరీరంలోకి పంపిస్తారు. ఇక్కడ రోగులకు సాధారణ చికిత్సలో ఇచ్చే విద్యుత్ కంటే ఐదు రెట్లు ఉపయోగించారు. చర్మం ద్వారా ఈ కరెంట్ సరఫరా కాగా చేతులు, కాళ్లలో చలనం వచ్చింది. నిజానికి హై ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ల కింద చర్మాన్ని మొద్దుబారేలా చేస్తుంది. తద్వారా రోగులు ఈ ఐదు రెట్ల కరెంట్ ను ఈజీగా తట్టుకోగలరు.


Similar News