Remote Kiss: ముద్దు ముచ్చట ఇలా తీర్చుకుందామా..!
మైళ్ల దూరంలో ఉండి విరహ వేదన అనుభవిస్తున్న భార్యాభర్తలు, ప్రేమికులు.. శారీరక సాన్నిహిత్యాన్ని మిస్ అవుతుంటారు.
దిశ, ఫీచర్స్: మైళ్ల దూరంలో ఉండి విరహ వేదన అనుభవిస్తున్న భార్యాభర్తలు, ప్రేమికులు.. శారీరక సాన్నిహిత్యాన్ని మిస్ అవుతుంటారు. వీడియో కాల్స్ ద్వారా ఎంత సేపు మాట్లాడుకున్నా.. ముద్దులు ఎక్స్‌చేంజ్ చేసుకున్నా సరే ఫిజికల్‌గా దగ్గరగా ఉన్నంత కిక్ అయితే రాదనడంలో సందేహం లేదు. అలాంటి స్పర్శను కూడా అనుభవించలేరు. కానీ చైనీస్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన ‘రిమోట్ కిస్’ డివైజ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే పార్ట్‌నర్స్ ముద్దును ఆస్వాదించగలిగే టెక్నాలజీతో ముందుకొచ్చింది. ఇందులో ఉండే ప్రెజర్ సెన్సార్స్, యాక్యుకేటర్స్, సాఫ్ట్ సిలికాన్.. సహజమైన పెదవుల ఉష్ణోగ్రతను, ముద్దుల శబ్దాలను ఎక్స్‌పీరియన్స్ చేసేలా సహాయపడతాయి.
రిమోట్ కిస్ విచిత్రమైన ఆకారంలో ఉన్న స్మార్ట్‌ఫోన్ డాక్ లాగా పనిచేస్తుంది. లిప్స్ ఆకారంలో ఉండే ఈ డివైజ్.. ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా పని చేస్తుంది. ఇది రెండు వేర్వేరు పరికరాల మధ్య కనెక్షన్‌ని ప్రారంభించే సహచర యాప్‌తో సాధ్యమవుతుంది. అదే సమయంలో వీడియో కాల్ మాదిరిగానే ఇద్దరు వినియోగదారుల సమ్మతిని కూడా అడుగుతుంది. కాగా ఈ అసాధారణ పరికరాన్ని చాంగ్‌జౌ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకాట్రానిక్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ చేస్తున్న జియాంగ్ జోంగ్లీ డెవలప్ చేశాడు. యూనివర్సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని తయారు చేసిన అతను.. 2019లో పేటెంట్ కోసం దరఖాస్తు చేసాడు. ఇక ప్రస్తుతం ఇవి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ టావోబావోలో అందుబాటులో ఉండగా.. ధర దాదాపు రూ.3386గా ఉంది.
ఇవి కూడా చదవండి : కాలేజ్‌కు వెళ్లే కూతురిపై కేసు వేసిన తండ్రి.. ప్రతి నెల పరిహారం చెల్లించాలని డిమాండ్