వికలాంగులను మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్న కేఫ్..

జపాన్ టోక్యోలోని ఓ కేఫ్ వికలాంగులను మాత్రమే హైర్ చేసుకుంటుంది. రోబోల టెస్టింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇలాంటి ప్రయోగం చేసింది. సక్సెస్ అయింది. జపనీస్ స్టార్ట్-అప్ కంపెనీ ఓరీ.. OriHime-D అని పిలువబడే

Update: 2024-07-16 06:34 GMT

దిశ, ఫీచర్స్: జపాన్ టోక్యోలోని ఓ కేఫ్ వికలాంగులను మాత్రమే హైర్ చేసుకుంటుంది. రోబోల టెస్టింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇలాంటి ప్రయోగం చేసింది. సక్సెస్ అయింది. జపనీస్ స్టార్ట్-అప్ కంపెనీ ఓరీ.. OriHime-D అని పిలువబడే రోబోలను తయారు చేసింది. వికలాంగులకు హెల్ప్ చేసేలా డిజైన్ చేయబడ్డాయి. కళ్లతో సూచనలు ఇస్తూ ఆపరేట్ చేయొచ్చు. వాటిని గమనిస్తూ కస్టమర్‌లతో మాట్లాడడం, వస్తువులను తీసుకెళ్లడం వంటివి చెప్పవచ్చు. ఈ సామర్ధ్యాలు కేఫ్‌లో ఉపయోగం కోసం స్వీకరించబడ్డాయి.

కాగా ఈ పైలట్ ప్రాజెక్ట్ వికలాంగులు, రోబో మధ్య కనెక్షన్‌లను పరీక్షిస్తుంది. ఇంట్లో ఉండే వ్యక్తులకు వేతనం సంపాదించడం పెట్టడం, ఇతర వ్యక్తులతో మరింత సులభంగా సంభాషించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ క్రమంలోనే డాన్ వెర్ కేఫ్‌లో రోబోల నియంత్రణకు వికలాంగులను హైర్ చేసుకుంది. వీరికి సాధారణ వెయిటర్ కు ఎంత చెల్లిస్తున్నారో అంత మొత్తంలో జీతం అందిస్తున్నారు. మరింత స్వతంత్రంగా ఉండేందుకు హెల్ప్ చేస్తున్నారు. వెన్నుపాము గాయాలు, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధితో బాధపడుతున్న రోగులను కూడా నియమించుకుంటుంది కేఫ్.


Similar News