ఆకలితో మాడిపోతే కంటి చూపు పోతుందా?
ఆకలితో ఉన్నప్పుడు ఆహారం అందుబాటులో లేకపోతే ఆగ్రహం కట్టలు తెంచుకుని అరిచేస్తే.. కొన్నిసార్లు అలసిపోయి నోట మాటకూడ రాదు.
దిశ, ఫీచర్స్: ఆకలితో ఉన్నప్పుడు ఆహారం అందుబాటులో లేకపోతే ఆగ్రహం కట్టలు తెంచుకుని అరిచేస్తే.. కొన్నిసార్లు అలసిపోయి నోట మాటకూడ రాదు. మళ్లీ శక్తిని పొందేందుకు ఆహారం తప్పనిసరి. అయితే సాలెపురుగులు ఆకలితో మాడిపోతుంటే వాటి కంటిచూపు తగ్గిపోతుందని గుర్తించారు సిన్సినాటి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కళ్లు చెదిరే ఈ దృగ్విషయానికి తామే సాక్షమని ప్రకటించారు.
ఫిడిప్పస్ ఆడాక్స్ అని పిలువబడే సాలెపురుగుల కళ్లలో లైట్-సెన్సిటివ్ ఫొటోరిసెప్టర్ కణాలు ఉంటాయి. అవి వీటిని వేటాడేందుకు ఉపయోగించుకుంటాయి. అయితే సాలీడు తక్కువ పోషకాలను పొందినప్పుడు.. ఆ ఫొటోరిసెప్టర్లను కోల్పోతుందని, వాటి జీవవ్యవస్థ విఫలం కావడం జరుగుతుందని శాస్త్రవేత్తలు గమనించారు. మానవుల విజన్‌లో మాక్యులా ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంటుందో సాలెపురుగుల్లో ఫొటోరిసెప్టర్లు అంతే ఇంపార్టెన్స్ కలిగి ఉండగా.. వీటిని లాస్ కావడంతో ఆహారాన్ని సంపాదించుకోవడం కూడా కష్టతరమవుతుందని వివరించారు. ఇక పోషకాలు లేని తొమ్మిది సాలెపురుగులను 12 కంట్రోలింగ్ స్పైడర్స్‌తో పోల్చిన నిపుణులు.. దృష్టి నష్టాన్ని అధ్యయనం చేయడానికి ఆప్తాల్మోస్కోప్‌ను ఉపయోగించారు. ఈ పరిశీలనలు మానవులలో కూడా విజన్ లాస్‌ను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయని నమ్మకం వ్యక్తం చేశారు.
Read More: బ్రహ్మ ముహూర్తం.. సూర్యోదయానికి ఎన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది..?