Benefits of Inguva: చిటికెడు ఇంగువతో ఈ సమస్యలు దూరం
ఎన్నో ఔషధ గుణాలున్న ఇంగువ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో మేలు చేస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఔషధ గుణాలున్న ఇంగువ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో మేలు చేస్తుంది. స్వచ్ఛమైన ఇంగువను ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా వాడుతారు. ఇంగువ శ్వాస సంబంధ అంటువ్యాధులను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.
కఫము తగ్గించటానికి, శ్వాస ఉత్తేజపరిచే ఒక మందుగా, ఛాతి పైన ఒత్తిడి తగ్గించటానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. తేనే, అల్లంతో కూడిన ఇంగువను దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటిశ్వాస సంబంధ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. వెయిట్ లాస్ అవ్వడానికి, చక్కెరలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి మేలు చేస్తుంది.
అంతేకాకుండా నొప్పులు, వాపులు తగ్గించడానికి ఇంగువ మంచి మెడిసిన్‌లా యూజ్ అవుతుందని తరచూ ఆయుర్వేద నిపుణులు చెబుతూనే ఉంటారు. అలాగే రుచి కోసం వాడే ఇంగువ పేగు కండరాలను సడలించడం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలకు కలిగే నష్టం నుంచి ఇంగువలోని ఆక్సిడెంట్ లక్షణాలు రక్షిస్తాయి.
మహిళలు పీరియడ్స్ సమయలో ఇంగువను ఆహరంలో భాగం చేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. ఇంగువలో స్థూలకాయాన్ని నిరోధించే లక్షణాలు ఉంటాయి. గోరువెచ్చని వాటర్‌లో క్రమం తప్పకుండా చిటికెడు ఇంగువ వేసుకుని తాగితే పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.