ఎదుటి వ్యక్తి మిమ్మల్ని వెంటనే ఇష్టపడాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవండి..

కొందరిని అనుకోకుండా కలుస్తాం. వెంటనే మెచ్చేస్తాం. వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాం. ఎప్పటికీ మనతో ఉండిపోతే బాగుంటుందని ఫీల్ అయిపోతాం. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇలా ఎదుటి వ్యక్తి వెంటనే నచ్చేందుకు చాలా కారణాలున్నాయి.

Update: 2024-07-11 07:46 GMT

దిశ, ఫీచర్స్: కొందరిని అనుకోకుండా కలుస్తాం. వెంటనే మెచ్చేస్తాం. వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాం. ఎప్పటికీ మనతో ఉండిపోతే బాగుంటుందని ఫీల్ అయిపోతాం. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇలా ఎదుటి వ్యక్తి వెంటనే నచ్చేందుకు చాలా కారణాలున్నాయి. కాగా ఇష్టపడే వ్యక్తులుగా మార్చేందుకు వారికున్న విచిత్రమైన అలవాట్లు ఏంటో చూద్దాం.

చమత్కారం

కొంతమంది చాలా చమత్కారంగా మాట్లాడుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులను హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులకు జనం వెంటనే అట్రాక్ట్ అవుతారు. నమ్ముతారు. వారి సహవాసాన్ని ఇష్టపడుతారు.

చురుగ్గా వినడం

అవతలి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినడం.. మనం మాట్లాడే సమయం కోసం ఎదురుచూడటం.. నిజమైన ఆసక్తిని కనబరుస్తుంది. ఐ కాంటాక్ట్, తల ఊపడం, చెప్పే విషయాలపై ప్రశ్నలు అడగడం, ప్రతిస్పందించడం లాంటివి చేస్తే ఈజీగా నచ్చుతారు.

సానుభూతి

మనం జర్నీ చేసేటప్పుడు ఎవరైనా తమ బాధను చెప్పుకున్నప్పుడు సానుభూతి ప్రకటిస్తాం. వారి కష్టాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటి మద్దతును చాలా మంది కోరుకుంటారు. ఇలా సపోర్ట్ చేసి బాధను దూరం చేసే వాళ్లు దగ్గరగా ఉండాలని అనుకుంటారు. అప్పుడు వారి మెదడులోని రివార్డ్ సెంటర్ రియాక్ట్ అవుతుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతాయి.

వినయం

ప్రగల్భాలు పలుకుతూ గర్వంతో విర్రవీగే వ్యక్తులతో ఉండేందుకు ఎవరు ఇష్టపడరు. అదే సమయంలో వినయంగా ఉండేవారు తెగ నచ్చేస్తారు. ఇలా ఉంటేనే ఎక్కువగా నేర్చుకునేందుకు, ఎదిగేందుకు అవకాశం ఉంటుంది కూడా. ఈ అలవాటు ఇతరులకు మీరు సన్నిహితంగా ఉన్నట్లు చూపిస్తుంది. మిమ్మల్ని మరింత ఇష్టపడేలా చేస్తుంది.

కృతజ్ఞత

ఎదుటి వ్యక్తి జీవితంలో ఎదిగేందుకు సహాయం చేసినప్పుడు కృతజ్ఞతతో ఉంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతారు. ప్రశంసల వర్షం కురిపిస్తారు. అందుకే డెయిలీ కమ్యూనికేషన్ లోనూ థాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.


Similar News